“ఉల్లి తినడం మానేయండి”: ఆజం ఖాన్!

| Edited By: Pardhasaradhi Peri

Dec 06, 2019 | 5:41 PM

ఉల్లిపాయల ధరల పెరుగుదల కారణంగా దేశంలో సామాన్యులు వాటిని తినలేని దుస్థితి నెలకొంది. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అజం ఖాన్ గురువారం మాట్లాడుతూ ఉల్లిపాయలు తినడం అవసరం లేదని తెలిపారు. “ఉల్లిపాయలు తినడం మానేయండి, తినడానికి బలవంతం ఏమిటి? మన జైన సోదరులు వాటిని తినరు. ఉల్లిపాయలు తినడం మానేయండి, వెల్లుల్లి తినడం మానేయండి, మాంసం తినడం మానేయండి, ప్రతిదీ ఆదా అవుతుంది ”అని ఖాన్ మీడియాతో అన్నారు. ఉల్లిపాయలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ […]

ఉల్లి తినడం మానేయండి: ఆజం ఖాన్!
Follow us on

ఉల్లిపాయల ధరల పెరుగుదల కారణంగా దేశంలో సామాన్యులు వాటిని తినలేని దుస్థితి నెలకొంది. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అజం ఖాన్ గురువారం మాట్లాడుతూ ఉల్లిపాయలు తినడం అవసరం లేదని తెలిపారు. “ఉల్లిపాయలు తినడం మానేయండి, తినడానికి బలవంతం ఏమిటి? మన జైన సోదరులు వాటిని తినరు. ఉల్లిపాయలు తినడం మానేయండి, వెల్లుల్లి తినడం మానేయండి, మాంసం తినడం మానేయండి, ప్రతిదీ ఆదా అవుతుంది ”అని ఖాన్ మీడియాతో అన్నారు.

ఉల్లిపాయలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఉల్లిపాయలు తినడం మానేయాలని దేశానికి ఆమె సందేశం అని ఖాన్ అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయి, దీనిపై ప్రజలలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.. నేను ఉల్లిపాయ లేదా వెల్లుల్లి ఎక్కువగా తిననని , మా కుటుంబాల్లో ఈ రెండు ఎక్కువగా ఉపయోగించరని తెలిపారు.

“ఆమె ఉల్లిపాయలు తినదని ఆర్థిక మంత్రి చెప్పారు, కాబట్టి ఆమె ఏమి తింటుంది? ఆమె అవోకాడో తింటుందా? ”అని నిన్న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్‌పై విడుదలైన చిదంబరం చమత్కరించారు. ఢిల్లీలోని అనేక మార్కెట్లలో ఉల్లి కిలో 109 రూపాయలకు చేరువైంది. తమిళనాడు మదురైలో 120 రూపాయలకు విక్రయిస్తున్నట్లు నివేదికలు వెల్లడించగా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధరలు 150 రూపాయలకు చేరుకున్నాయి.

[svt-event date=”06/12/2019,4:08PM” class=”svt-cd-green” ]