కరోనాకు మెరుగైన ఫలితాలు ఇస్తోన్న ‘ఆవిరి’

| Edited By:

Aug 03, 2020 | 7:45 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు వంటింటి చిట్కాలు ఔషధాలుగా పనిచేస్తున్నాయి. డాక్టర్లు సైతం వీటివైపు మొగ్గుచూపుతుండటం గమనించాల్సిన విషయం.

కరోనాకు మెరుగైన ఫలితాలు ఇస్తోన్న ఆవిరి
Follow us on

Steam Therapy for Corona: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు వంటింటి చిట్కాలు ఔషధాలుగా పనిచేస్తున్నాయి. డాక్టర్లు సైతం వీటివైపు మొగ్గుచూపుతుండటం గమనించాల్సిన విషయం. ఈ క్రమంలో కరోనా నియంత్రణకు ఆవిరి చికిత్స (స్టీమ్‌ థెరపీ) బాగా పనిచేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముంబయిలోని ఓ ఆసుపత్రి వైద్యులు మూడు నెలలుగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాన్ని కనుగొన్నారు. ఈ పరిశోధనకు డా.దిలీప్ పవార్‌ నేతృత్వం వహించారు.

ఈ బృందం పలువురు కరోనా‌ పాజిటివ్‌ రోగులపై స్టీమ్‌ థెరపీ ప్రయోగం నిర్వహించింది. పరిశోధనలో 105 మంది బాధితులను రెండు గ్రూపులుగా విభజించారు. అందులో అసింప్టమాటిక్‌(లక్షణాలు లేని) బాధితులు రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం వల్ల త్వరగా కోలుకున్నారు. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్లు ప్రతి మూడు గంటలకోసారి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టగా.. వారంలో సాధారణ స్థితికి వచ్చారు. కొన్ని రకాల క్యాప్సూల్స్, విక్స్, అల్లం ఇలా కొన్నింటితో ఈ ఆవిరి చికిత్సను రోగులకు చేశారు.

Read This Story Also: ఏపీసీఆర్‌డీఏ స్థానంలో ఏఎంఆర్‌డీఏ