ఐసీయూలో పిల్లి సంచారం..హ్యూమ‌న్ రైట్స్ కమిషన్ ​నోటీసులు

| Edited By: Anil kumar poka

May 03, 2020 | 11:57 AM

తెలంగాణ ఉస్మానియా ఆసుపత్రిలోని ఎమ‌ర్జెన్సీ వార్డులో ఓ పిల్లి తెగ‌ చక్కర్లు కొడుతుందంట‌. హా.. పిల్ల‌లు సంచ‌రించ‌డం కామ‌నే క‌దా అని ఓ నిట్టూర్పు విడ‌వ‌కండి. దీనివ‌ల్ల అన‌ర్దాలున్నాయంటూ లాయ‌ర్ రామచంద్రారెడ్డి ఈ-మెయిల్​ ద్వారా చేసిన కంప్లైంట్ కు హ్యూమ‌న్ రైట్స్ కమిషన్​ స్పందించింది. రోగుల తెచ్చుకున్న పాలు, పండ్లు పిల్లు‌లు తాగ‌డం, తిన‌డం వంటివి చేస్తున్నాయ‌ని..దీని వ‌ల్ల అప్ప‌టికే ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో అక్క‌డికి చేరుకున్న రోగులకు ఇంకొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న ఫిర్యాదులో […]

ఐసీయూలో పిల్లి సంచారం..హ్యూమ‌న్ రైట్స్ కమిషన్ ​నోటీసులు
Follow us on

తెలంగాణ ఉస్మానియా ఆసుపత్రిలోని ఎమ‌ర్జెన్సీ వార్డులో ఓ పిల్లి తెగ‌ చక్కర్లు కొడుతుందంట‌. హా.. పిల్ల‌లు సంచ‌రించ‌డం కామ‌నే క‌దా అని ఓ నిట్టూర్పు విడ‌వ‌కండి. దీనివ‌ల్ల అన‌ర్దాలున్నాయంటూ లాయ‌ర్ రామచంద్రారెడ్డి ఈ-మెయిల్​ ద్వారా చేసిన కంప్లైంట్ కు హ్యూమ‌న్ రైట్స్ కమిషన్​ స్పందించింది. రోగుల తెచ్చుకున్న పాలు, పండ్లు పిల్లు‌లు తాగ‌డం, తిన‌డం వంటివి చేస్తున్నాయ‌ని..దీని వ‌ల్ల అప్ప‌టికే ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో అక్క‌డికి చేరుకున్న రోగులకు ఇంకొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

రామచంద్రారెడ్డి ఫిర్యాదుకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను మే 22 వరకు అందజేయాలని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండ్​ను ఆదేశించింది. అవును ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఎంతో జాగ్ర‌త్త అవ‌సరం. ఆరోగ్య ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా ఉన్న‌వారికి అక్క‌డ చికిత్స అందిస్తారు. అటువంటి చోట ఇలాంటివి జ‌రిగితే కొత్త ఇన్పెక్ష‌న్లు సోకే ప్ర‌మాదం ఉంది. ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ఆస్ప‌త్రి యాజ‌మాన్యాలు బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలి.