స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్!

| Edited By:

Nov 07, 2019 | 8:30 PM

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తన కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. పెన్షన్ అకౌంట్‌దారులు అందరూ లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని బ్యాంక్ బ్రాంచ్‌లకు అందించాలని కోరింది. లేదంటే ఆన్‌లైన్‌లో ఈ నెల చివరికల్లా ఈ సర్టిఫికెట్‌ను సమర్పించాలని తెలిపింది. ‘2019 నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం పూర్తి చేయండి. తద్వారా పెన్షన్ చెల్లింపు కొనసాగేలా చూసుకోండి. స్టేట్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి సర్టిఫికెట్‌ను అందజేయవచ్చు. లేదంటే […]

స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్!
Follow us on

బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తన కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. పెన్షన్ అకౌంట్‌దారులు అందరూ లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని బ్యాంక్ బ్రాంచ్‌లకు అందించాలని కోరింది. లేదంటే ఆన్‌లైన్‌లో ఈ నెల చివరికల్లా ఈ సర్టిఫికెట్‌ను సమర్పించాలని తెలిపింది.

‘2019 నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం పూర్తి చేయండి. తద్వారా పెన్షన్ చెల్లింపు కొనసాగేలా చూసుకోండి. స్టేట్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి సర్టిఫికెట్‌ను అందజేయవచ్చు. లేదంటే దగ్గరిలోని ఆధార్ ఔట్‌లెట్స్‌లో కూడా డిజిటల్ రూపంలో సమర్పించొచ్చు’ అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. పెన్షన్ తీసుకుంటున్న వారు నిర్దేశిత గడువులోగా (నవంబర్ 30) లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించకపోతే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. లైఫ్ సర్టిఫికెట్ అందించిన తర్వాతనే మళ్లీ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. అందుకే ముందు జీవన్ ప్రమాణ్ పత్రాన్ని అందించే పనిని పూర్తి చేయండి.