సూర్య గ్రహణం రోజు.. శ్రీకాళహస్తీశ్వరుని కి ప్రత్యేక పూజలు..

| Edited By:

Jun 20, 2020 | 8:16 PM

అమావాస్య నాడు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణము ఏర్పడుతుంది. రేపు (ఆదివారం) సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం

సూర్య గ్రహణం రోజు.. శ్రీకాళహస్తీశ్వరుని కి ప్రత్యేక పూజలు..
Follow us on

అమావాస్య నాడు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణము ఏర్పడుతుంది. రేపు (ఆదివారం) సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం సూర్యగ్రహణం ఉన్నా ఆదివారం శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచే ఉంచుతామని ఆ ఆలయ ఎగ్జిక్యూటివ్‌ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గ్రహణం రోజు ఆలయంలో శ్రీకాళహస్తీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు కొనసాగుతాయని భక్తులు రాహు, కేతు పూజలు సైతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆలయంలో 10గంటల 18 నిమిషాల నుంచి 11గంటల 45 నిమిషాల వరకు దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నామని తెలిపారు.

కోవిద్-19 నిబంధనలు పాటిస్తూ.. ఆలయానికి వచ్చే భక్తులు విధిగా మాస్కు ధరించాలని, భౌతికదూరం నిబంధన పాటించాలని కోరారు. వృద్ధులు, చిన్నారులను ఆలయంలోకి అనుమతించబోమని వెల్లడించారు. గంటలకు 300 నుంచి 400మంది భక్తులను అనుమతిస్తామని, ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మహాలఘు దర్శనం ఉంటుందని పేర్కొన్నారు.

Also Read: కరోనా కట్టడకోసం ‘కఫసుర’.. ఐదు రోజుల్లోనే..