గోవాలో హై అలర్ట్..

| Edited By:

Apr 22, 2019 | 12:30 PM

పనాజీ : ఈస్టర్ పండుగ సందర్భంగా శ్రీలంక దేశంలో ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో గోవా రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. గోవాలోని చర్చ్‌లలో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు కనిపించినా పోలీసులు వెంటనే ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. శ్రీలంక ఉగ్రదాడిని ఖండించిన సీఎం సావంత్.. రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ ప్రణబ్ నందాను ఆదేశించారు. దీంతో స్థానిక చర్చిలలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. గోవా, డామన్ చర్చ్ ల ఆర్చి […]

గోవాలో హై అలర్ట్..
Follow us on

పనాజీ : ఈస్టర్ పండుగ సందర్భంగా శ్రీలంక దేశంలో ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో గోవా రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. గోవాలోని చర్చ్‌లలో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు కనిపించినా పోలీసులు వెంటనే ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. శ్రీలంక ఉగ్రదాడిని ఖండించిన సీఎం సావంత్.. రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని డీజీపీ ప్రణబ్ నందాను ఆదేశించారు. దీంతో స్థానిక చర్చిలలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. గోవా, డామన్ చర్చ్ ల ఆర్చి బిషప్ లతో డీజీపీ ప్రణబ్ నందా మాట్లాడి భద్రతను పెంచారు. గోవాలో ఎలాంటి పేలుళ్లు జరగకుండా యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, జిల్లా పోలీసులు, ప్రత్యేక బలగాలను మోహరించారు.