పేలుళ్ల సూత్రధారుల్లో ముగ్గురు మహిళలు..!

| Edited By:

Apr 26, 2019 | 12:46 PM

శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన అనుమానితుల ఫొటోలను రిలీజ్ చేశారు ఆ దేశ అధికారులు. మొత్తం ఆరుగురు అనుమానితుల ఫోటోల‌ను విడుద‌ల చేశారు. వారిలో ముగ్గురు మ‌హిళ‌లు కూడా ఉన్నారు. దాడుల త‌ర్వాత లంక‌లో దేశ‌వ్యాప్తంగా త‌నిఖీలు నిర్వ‌హించగా.. అనుమానాస్పదులుగా భావించిన 76 మందిని అరెస్ట్ చేశారు. నేష‌న‌ల్ తౌహీద్ జ‌మాత్‌కు చెందిన 9 మంది సూసైడ్ బాంబ‌ర్లు వ‌రుస పేలుళ్ల‌కు పాల్ప‌డినట్లు లంక పోలీసులు మొదట ప్రకటించారు. పేలుళ్ల ఘటన వెనక స్థానిక ఎన్‌టీజే సంస్థ […]

పేలుళ్ల సూత్రధారుల్లో ముగ్గురు మహిళలు..!
Follow us on

శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన అనుమానితుల ఫొటోలను రిలీజ్ చేశారు ఆ దేశ అధికారులు. మొత్తం ఆరుగురు అనుమానితుల ఫోటోల‌ను విడుద‌ల చేశారు. వారిలో ముగ్గురు మ‌హిళ‌లు కూడా ఉన్నారు. దాడుల త‌ర్వాత లంక‌లో దేశ‌వ్యాప్తంగా త‌నిఖీలు నిర్వ‌హించగా.. అనుమానాస్పదులుగా భావించిన 76 మందిని అరెస్ట్ చేశారు. నేష‌న‌ల్ తౌహీద్ జ‌మాత్‌కు చెందిన 9 మంది సూసైడ్ బాంబ‌ర్లు వ‌రుస పేలుళ్ల‌కు పాల్ప‌డినట్లు లంక పోలీసులు మొదట ప్రకటించారు. పేలుళ్ల ఘటన వెనక స్థానిక ఎన్‌టీజే సంస్థ హస్తం ఉందని దర్యాప్తు సంస్థలు కూడా నిర్థారించగా, అది తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ – ఐసిస్ ప్రకటించుకుంది. కాగా.. పేలుళ్ల‌లో 359 మంది మ‌ర‌ణించిన‌ట్లు మొద‌ట అధికారులు ప్ర‌క‌టించారు. అయితే.. మృతులను రెండు సార్లు లెక్కించ‌డం వ‌ల్ల ఆ త‌ప్పు జ‌రిగింద‌ని, పేలుళ్ల‌లో చ‌నిపోయిన మృతులు 253 మంది మాత్రమేనని తేల్చారు.