అమెరికా ఉద్యమ నినాదం.. ‘8.46’

| Edited By:

Jun 05, 2020 | 12:28 PM

అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి ప్రతీకగా.. హత్యకు గురైన ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్‌కి కరోనా సోకినట్లు తేలింది. ఫ్లాయిడ్ మరణానికి సంబంధించి కొన్ని క్లినికల్ వివరాలకు సంబంధించి

అమెరికా ఉద్యమ నినాదం.. 8.46
Follow us on

అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి ప్రతీకగా.. హత్యకు గురైన ఆఫ్రో అమెరికన్ జార్జి ఫ్లాయిడ్‌కి కరోనా సోకినట్లు తేలింది. ఫ్లాయిడ్ మరణానికి సంబంధించి కొన్ని క్లినికల్ వివరాలకు సంబంధించి హెన్నెపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం 20 పేజీల నివేదికను విడుదల చేసింది. అదుపులోకి తీసుకున్న సమయంలో ఫ్లాయిడ్‌కి హార్ట్ ఎటాక్ వచ్చిందని అందులో పేర్కొన్నారు. కాగా ఫ్లాయిడ్‌ది హోమిసైడ్(నరహత్య) అని మెన్నెపిన్ కౌంటీ డాక్టర్లు స్పష్టం చేశారు.

ఈ దారుణ నరహత్యకు, వివక్షకు వ్యతిరేకంగా అమెరికాలో జరుగుతున్న ఉద్యమానికి ‘8.46’అన్న అంకె నినాదంగా మారుతోంది. ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ను మే 25న మినియాపోలీస్‌ పోలీసు అధికారి డెరెక్‌ చెవెన్‌ నేలకు అదిమిపెట్టి ఉంచిన సమయం 8 నిమిషాల 46 సెకన్లు అని విచారణ సందర్భంగా తెలియడంతో ఉద్యమకారులు ఆ అంకెను నినాదంగా మార్చారు. ఈ సమయాన్ని ఇంత కచ్చితంగా ఎలా నిర్ధారించారన్న అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ ఆందోళనకారుల్లో మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది.

కాగా.. అమెరికా రాష్ట్రమైన హ్యూస్టన్‌ చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించే వాళ్లు చేతుల్లో క్యాండిల్స్ పెట్టుకుని 8.46 నిమిషాలపాటు మోకాళ్లపై పాకుతూ నిరసన వ్యక్తం చేయడం బోస్టన్, టాకోమా, వాషింగ్టన్‌లలో జరిగిన ప్రధర్శనలు 8.46 నిమిషాలపాటు జరగడం.. ఈ అంకెకు ఏర్పడిన ప్రాధాన్యానికి సూచికలు. టెలివిజన్‌ చానల్ వయాకామ్‌సీబీఎస్‌ గతవారం ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పిస్తూ 8.46 నిమిషాలపాటు ప్రసారాలు నిలిపివేసింది.

[svt-event date=”05/06/2020,12:14PM” class=”svt-cd-green” ]