Lacdown2.0 మొబైల్ యాప్, టోల్ ఫ్రీ నెంబర్లు.. వ్యవసాయానికి మోదీ చేయూత

| Edited By: Pardhasaradhi Peri

Apr 18, 2020 | 2:33 PM

మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 20 నుంచి) దేశంలో లాక్ డౌన్ ఎగ్జిట్ పాలసీ అమల్లోకి రాబోతోంది. పలు రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునివ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. ఏఏ రంగాలకు మినహాయింపులు ఇచ్చేది...

Lacdown2.0 మొబైల్ యాప్, టోల్ ఫ్రీ నెంబర్లు.. వ్యవసాయానికి మోదీ చేయూత
Follow us on

మరో రెండు రోజుల్లో (ఏప్రిల్ 20 నుంచి) దేశంలో లాక్ డౌన్ ఎగ్జిట్ పాలసీ అమల్లోకి రాబోతోంది. పలు రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునివ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించింది. ఏఏ రంగాలకు మినహాయింపులు ఇచ్చేది రోజూ ఒక్కో ప్రభుత్వ ఉత్తర్వుని వెలువరిస్తూనే వుంది. వ్యవసాయ రంగానికి, వ్యవసాయోత్పత్తుల రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు ఇదివరకే చాలా సార్లు కేంద్ర ప్రకటించింది. దానికి అనుగుణంగా ఉత్తర్వులను జారీ చేసింది. తాజాగా వ్యవసాయోత్పత్తుల రవాణా కోసం మరిన్ని ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తుల రవాణా కోసం ట్రాన్స్‌పోర్ట్‌ అగ్రి గేటర్‌ మొబైల్‌ యాప్‌‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కిసాన్‌ రథ్‌ యాప్ అంటూ దానికి నామకరణం చేసింది మోదీ ప్రభుత్వం. ఈ యాప్‌ని విడుదల చేశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌. వ్యవసాయ క్షేత్రాల నుంచి ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు 5 లక్షల ట్రక్కులు, 20 వేల ట్రాక్టర్లు ఈ మొబైల్‌ ప్లాట్‌పామ్‌లో అందుబాటులో వుంటాయని నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.

లాక్‌డౌన్‌ సమయంలో రైతుల తమ ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన ట్రాక్టర్లు, ట్రక్కులు దొరక్క ఇబ్బందులు పడకుండా ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. వ్యవసాయ దారుల ట్రాన్స్‌పోర్ట్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. 14488, 18001804200 టోల్ ఫ్రీ నెంబర్లను కేటాయించామని అయనన్నారు. ఈ నెంబర్లకు కాల్ చేసి అవసరమైన సాయాన్ని పొందవచ్చని ఆయన తెలిపారు.