స్పెయిన్ మంత్రికి కరోనా.. ఉప ప్రధానికి కూడా..?

| Edited By:

Mar 12, 2020 | 10:54 PM

కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. ఈ క్రమంలో స్పెయిన్ మంత్రి ఇరేనే మాంటెరో ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు

స్పెయిన్ మంత్రికి కరోనా.. ఉప ప్రధానికి కూడా..?
Follow us on

కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. ఈ క్రమంలో స్పెయిన్ మంత్రి ఇరేనే మాంటెరో ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఇంటి వద్దనే తనకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్టు ఆమె తెలిపారు.

అయితే.. చైనా వెలుపల గత రెండు వారాలుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తనను కూడా ఇంటివద్దనే ఉంచి పరిశీలనలో పెట్టినట్టు మంత్రి ఇరేనే భర్త, స్పెయిన్ ఉప ప్రధాని పబ్లో ఇగ్లెసియా ట్విటర్లో తెలిపారు. ప్రస్తుతం కరోనా పరీక్షల ఫలితం కోసం తాను ఎదురుచూస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని సభ్యులంతా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలంటూ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.

[svt-event date=”12/03/2020,9:56PM” class=”svt-cd-green” ]