యూపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్లాఖాన్ పై ఆరేళ్ల నిషేధం..?

|

Sep 25, 2020 | 12:42 PM

తప్పుడు సమాచారంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన మరో నేతపై వేటు పడింది. సమాజ్‌వాదీ ఎంపీ ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లాఖాన్ ఎన్నికల్లో పోటీచేయకుండా ఆరేళ్లపాటు నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సచివాలయం భారత రాష్ట్రపతికి లేఖ రాసింది.

యూపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్లాఖాన్ పై ఆరేళ్ల నిషేధం..?
Follow us on

తప్పుడు సమాచారంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన మరో నేతపై వేటు పడింది. సమాజ్‌వాదీ ఎంపీ ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లాఖాన్ ఎన్నికల్లో పోటీచేయకుండా ఆరేళ్లపాటు నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సచివాలయం భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు తాజాగా లేఖ రాసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో ఆయనపై చర్య తీసుకోవాలంటే లేఖలో పేర్కోన్నారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ఎకింద అబ్దుల్లాఖాన్ ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలంటూ యూపీ అసెంబ్లీ సెక్రటేరియెట్ రాష్ట్రపతికి లేఖలో కోరింది. ఈ లేఖ ఆధారంగా రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల కమిషన్ సమ్మతితో చర్యలు తీసుకునే అవకాశముంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తన పుట్టినతేదీకి సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించి పోటీ చేశారు. యూపీలోని రాంపూర్ జిల్లా సువార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్దుల్లాఖాన్ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో యూపీ సచివాలయం రాష్ట్రపతికి రాసిన లేఖలో తెలిపింది. సువార్ అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీ సర్కార్ అబ్దుల్లాఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నివారించేందుకు యత్నిస్తోంది. 2017లో ఎన్నికలు జరిగినపుడు 25 ఏళ్ల లోపు ఉన్న అబ్దుల్లా పుట్టినతేదీని మార్చారని యూపీ సర్కారు పేర్కొంది. తాజాగా రాష్ట్రపతికి రాసిన లేఖతో అబ్దుల్లాఖాన్ పై వేటు పడే అవకాశముంది.