Sourav Ganguly discharged: ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్ఛార్జ్‌.. చికిత్స చేసిన డాక్టర్లకు పేరుపేరునా కృతజ్ఞతలు

|

Jan 07, 2021 | 11:58 AM

భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి నుంచి గురువారం డిశ్ఛార్జ్‌ అయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో

Sourav Ganguly discharged: ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్ఛార్జ్‌.. చికిత్స చేసిన డాక్టర్లకు పేరుపేరునా కృతజ్ఞతలు
Follow us on
Sourav Ganguly health update: భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి నుంచి గురువారం డిశ్ఛార్జ్‌ అయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో గంగూలీని గత శనివారం ఆసుపత్రికి తరలించగా, పరీక్షల్లో అతను స్వల్ప గుండెపోటుకు గురైనట్లు పరీక్షలు చేసిన వైద్యులు నిర్ధారించారు. ఆపై ఆయనకు యాంజియోప్లాస్టీ  చేశారు. దాదా ఆరోగ్యం క్రమక్రమంగా కుదటపడింది. గుండె పనితీరు సహా రక్త ప్రసరణ సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించిన అనంతరం గంగూలీని గురువారం డిశ్ఛార్జ్‌ అయ్యారు. ముందుగా బుధవారమే డిశ్ఛార్జ్ చేయాలని డాక్టర్లు నిర్ణయించుకున్నా.. మరోరోజు ఆస్పత్రిలో ఉండాలని గంగూలీ నిర్ణయించుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా తనకు వైద్యం అందించిన డాక్టర్లకు దాదా పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.
“చికిత్స చేసినందుకు ఆసుపత్రిలోని వైద్యులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  నేను బాగానే ఉన్నాను. త్వరలోనే నేను ప్రయాణించడానికి సిద్ధంగా ఉంటానని ఆశిస్తున్నాను” అని వుడ్ల్యాండ్స్ హాస్పిటల్ బయట మీడియాలో గంగూలీ చెప్పారు.

Also Read :

Cockfights in Godavari Districts: నేటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో 144 సెక్షన్.. పందాల కట్టడికి గ్రామ కమిటీలు

AP Temple Politics: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. టీడీపీ హయాంలో కూల్చేసిన ఆలయాలను పునర్నించేందుకు శ్రీకారం

Bowenpally Kidnap Case: అఖిల ప్రియకు ఫిట్స్.. బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ.. పరారీలోనే భార్గవ్ రామ్