కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

|

Aug 20, 2020 | 8:33 PM

కరోనా కాలంలో ఎంతోమంది ప్రజల కోసం నటుడు సోనూసూద్ కలియుగ కర్ణుడి అవతారమెత్తాడు. కుల, మత, భాష అనే తేడా లేకుండా కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికి తోచినంత సాయం చేశాడు.

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..
Follow us on

Sonu Sood A Twitter Hero: కరోనా కాలంలో ఎంతోమంది ప్రజల కోసం నటుడు సోనూసూద్ కలియుగ కర్ణుడి అవతారమెత్తాడు. కుల, మత, భాష, రాష్ట్రం అనే తేడా లేకుండా కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికి తోచినంత సాయం చేశాడు. ఉపాధి కోల్పోయిన వారికి ఉద్యోగం, కరోనాతో బాధపడుతున్న పేదలకు చికిత్స అందించడం, వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చడం, ఊరు గానీ ఊరులో చిక్కుకున్న విద్యార్ధులను తిరిగి భారత్‌కు రప్పించడం.. ఇలా ఒకటేమిటి.. లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇదిలా ఉంటే సాయం కోసం ప్రజలు ఇప్పటికీ సోనూసూద్‌కు విపరీతంగా మెసేజ్‌లు చేస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఆయన ఏకంగా 31 వేల మెసేజ్‌లు వచ్చాయి. ఈ విషయాన్ని సోనూసూద్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ”1137 మెయిల్స్… 19000 ఫేస్ బుక్ మెసేజ్‌స్.. 4812 ఇన్‌స్టా మెసేజ్‌లు, 6741 ట్విట్టర్ మెసేజ్‌లు.. ఇవాళ వచ్చిన హెల్ప్ మెసేజ్‌లు.. ప్రతి ఒక్కరిని చేరుకోవడం అసాధ్యం. అయినా కూడా నా వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఒకవేళ ఎవరిదైనా నేను మిస్ అయితే మాత్రం నన్ను క్షమించండి” అని సోనూసూద్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Also Read:

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ ఆసరా’కు కేబినెట్ ఆమోదం..

మురుగునీటిలో కరోనా వైరస్.. తేల్చేసిన పరిశోధకులు..

డిలేట్ చేసిన వాట్సాప్ వీడియోలు, ఇమేజ్స్‌ను రికవర్ చేయండిలా..