#COVID19 మాటల్లో కాదు చేతల్లో… కేబినెట్‌లో కొత్త స్టైల్

|

Mar 25, 2020 | 1:00 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను మాటల నేతను కాదు.. చేతల నేతను అని మరోసారి చాటారు. కరోనా వైరస్ భయాందోళన నేపథ్యంలో దేశప్రజలందరు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ప్రధాన మంత్రి పదే పదే పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో...

#COVID19 మాటల్లో కాదు చేతల్లో... కేబినెట్‌లో కొత్త స్టైల్
Follow us on

Prime Minister Narendra Modi model cabinet meet: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను మాటల నేతను కాదు.. చేతల నేతను అని మరోసారి చాటారు. కరోనా వైరస్ భయాందోళన నేపథ్యంలో దేశప్రజలందరు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ప్రధాన మంత్రి పదే పదే పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక దూరాన్ని పాటించే దిశగా తాము సైతం వైద్యుల సూచనలను పాటిస్తున్నామని చాటారు ప్రధాన మంత్రి.

మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు దేశప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ… ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశమంతటా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు సామాజిక దూరాన్ని పాటించడం విధి అని పునరుద్ఘాటించారు. అందరు ఇళ్ళలోనే వుంటూ పరిశుభ్రత పాటించాలని, సామాజిక దూరాన్ని పాటించాలన్నది ప్రధాని పిలుపు.

ఈ క్రమంలో బుధవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ.. సంప్రదాయ సమావేశం తీరును పక్కన పెట్టి.. కుర్చీలను దూరం దూరం వేసుకుని కేబినెట్ భేటీ నిర్వహించారు ప్రధాని మోదీ. కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధాన మంత్రి పక్కన కొద్ది దూరంలో ఓ పక్కన అమిత్ షా, మరో పక్కన రాజ్‌నాథ్ సింగ్ ఫోటోలో కనిపిస్తున్నారు. సమావేశంలో దూరం దూరంగా కూర్చున్న ప్రధాని.. ప్రతీ సీటు మధ్య కనీసం 3 అడుగుల దూరం మెయింటేన్ చేశారు.

సామాజిక దూరం పాటించడమే కరోనా విస్తరణకు విరుగుడు అన్నది వైద్యుల సూచన. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే సమావేశాలను నిర్వహించవద్దని ప్రభుత్వాలు ప్రజలకు సూచిస్తున్నాయి. ఈక్రమంలో ప్రభుత్వాలే పెద్ద సంఖ్యలో మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహించి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. ఈ తప్పనిసరి సమావేశాల్లో సామాజిక దూరాన్ని పాటించకపోతే వారు కూడా ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి వుంది. అందుకే కేబినెట్ భేటీలో సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా ఇలాంటి క్రూషియల్ సమావేశాల్లోను ఎలా వుండాలో ప్రభుత్వాధినేతలకు చాటారు మోదీ.