చిదంబరానికి చిరు ఊరట

|

Oct 17, 2019 | 6:24 PM

56 రోజులుగా జైలు జీవితం గడుపుతున్న కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. బెయిల్ దొరికిందనుకుంటున్నారా ? అయితే మీరు పొరబడినట్లే. అయితే సిబిఐ లేకపోతే ఈడీ.. ఇలా మార్చి, మార్చి కస్టడీకి తీసుకునేందుకు పోటీపడుతున్న తరుణంలో చిదంబరానికి ఇప్పట్లో బెయిల్ దొరికే ఛాన్సెస్ లేవనే చెప్పాలి.  కానీ.. కోర్టు ఒక్క విషయంలో మాత్రం చిదంబరానికి ఊరట నిచ్చింది. పెనం నుంచి పొయ్యిలో పడినట్లు సిబిఐ కేసులో జ్యూడిషియల్ రిమాండ్‌ […]

చిదంబరానికి చిరు ఊరట
Follow us on

56 రోజులుగా జైలు జీవితం గడుపుతున్న కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. బెయిల్ దొరికిందనుకుంటున్నారా ? అయితే మీరు పొరబడినట్లే. అయితే సిబిఐ లేకపోతే ఈడీ.. ఇలా మార్చి, మార్చి కస్టడీకి తీసుకునేందుకు పోటీపడుతున్న తరుణంలో చిదంబరానికి ఇప్పట్లో బెయిల్ దొరికే ఛాన్సెస్ లేవనే చెప్పాలి.  కానీ.. కోర్టు ఒక్క విషయంలో మాత్రం చిదంబరానికి ఊరట నిచ్చింది.

పెనం నుంచి పొయ్యిలో పడినట్లు సిబిఐ కేసులో జ్యూడిషియల్ రిమాండ్‌ అనుభవిస్తున్న చిదంబరం నిన్న ఈడీ కస్టడీకి చేరారు. తాజాగా ఆయన్ను కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ పిటీషన్‌పై సానుకూలంగా స్పందించింది. దాంతో ఆయన్ను పిటీ వారెంట్‌తో ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో జైలు జీవితం గడుపుతున్న చిదంబరం దాఖలు చేసుకున్న వెసులుబాటు పిటిషన్‌ను కోర్టు విచారించింది. చిదంబరం కోరుకున్న వెసులుబాటు కల్పించింది.

జైలు జీవితం నరకంలా వుందని భావిస్తున్న చిదంబరం తనకు వెస్టర్న్ టాయిలెట్ సౌకర్యం కల్పించాలని, ఇంటి భోజనం తెప్పించుకునే అనుమతించాలని, అన్ని సౌకర్యాలతో  కూడిన ప్రత్యేక సెల్‌ను తనకు కేటాయించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. చిదంబరం కోరుకున్న సౌకర్యాలను కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. సో.. చిదంబరానికి కాస్తైనా ఊరట దొరికిందంటే లక్కే కదా ?