నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం!

|

Dec 19, 2019 | 2:04 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త అందించారు. ఇప్పటికే డిగ్రీ నాలుగేళ్లు.. ఇంజనీరింగ్ ఐదేళ్లు చేయాలని కసరత్తులు చేస్తున్న ఆయన.. స్టూడెంట్స్‌కు నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ,  విశాఖలో హై ఎండ్‌ స్కిల్‌ వర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంతేకాక ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఒకే గొడుగు […]

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీకి శ్రీకారం!
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త అందించారు. ఇప్పటికే డిగ్రీ నాలుగేళ్లు.. ఇంజనీరింగ్ ఐదేళ్లు చేయాలని కసరత్తులు చేస్తున్న ఆయన.. స్టూడెంట్స్‌కు నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ,  విశాఖలో హై ఎండ్‌ స్కిల్‌ వర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సీఎం బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంతేకాక ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఒకే గొడుగు కిందకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.

ఇక ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలన్నీ విశ్వవిద్యాలయంతో అనుసంధానం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులు సీఎం దిశానిర్దేశించారు. ఇకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో ఎటువంటి అంశాలపై స్టూడెంట్స్‌కు శిక్షణ ఇవ్వాలన్న దానిపై స్కిల్స్ యూనివర్శిటీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాగా, ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి లేదా రెండు పాలిటెక్నీక్ కాలేజీలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక వీటన్నింటిని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చి.. వాటికి దిశానిర్దేశాలు చేయడానికి ఓ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఇంజనీరింగ్, డిప్లమో కోర్సులు అభ్యసించిన వారికి వీటి ద్వారా నైపుణ్యం మరింత పెంపొందే అవకాశాలు ఉన్నాయని సీఎం అన్నారు.

మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో నేర్చుకునే స్కిల్స్ ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే విధంగా ఉండాలని.. ఉన్నతస్థాయి విద్యాభోదకుల చేత స్టూడెంట్స్‌కు శిక్షణ ఇచ్చేందుకు రప్పించాలని.. ప్రముఖ ఎమ్‌ఎన్‌సి కంపెనీలతో ఈ సెంటర్లు అనుసంధానం అయ్యి ఉండాలని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.