నవరాత్రి ఉత్సవాలు… శ్రీమహాలక్ష్మీగా దుర్గమ్మ!

| Edited By:

Oct 05, 2019 | 6:06 AM

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అత్యంత కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజున కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రెండు చేతులలో మాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మీ రూపంలో అమ్మవారు అభయమిస్తున్నారు. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలకు శాంతి చేకూర్చింది అమ్మ.. ‘యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా’ లోకంలోని అన్ని ప్రాణుల్లో లక్ష్మీస్వరూపంలో ఉంటుందని చండీ సప్తశతి చెబుతోంది. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదు. సుఖంగా జీవించడానికి అవసరమయ్యే […]

నవరాత్రి ఉత్సవాలు... శ్రీమహాలక్ష్మీగా దుర్గమ్మ!
Follow us on

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అత్యంత కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజున కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రెండు చేతులలో మాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మీ రూపంలో అమ్మవారు అభయమిస్తున్నారు. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలకు శాంతి చేకూర్చింది అమ్మ.. ‘యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా’ లోకంలోని అన్ని ప్రాణుల్లో లక్ష్మీస్వరూపంలో ఉంటుందని చండీ సప్తశతి చెబుతోంది. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదు. సుఖంగా జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశమూ ఆ దేవిస్వరూపమే.

మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తశతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి.

‘లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం; శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం, త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం’ శ్లోకంతో అమ్మవారిని ప్రార్థించాలి. నైవేద్యంగా కేసరి నివేదిస్తారు.