ముత్తారం మండలంలో ఆరు పెద్ద పులులు..ఆందోళనలో గ్రామస్థులు

|

Sep 07, 2020 | 7:51 PM

ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పులల సంచారం రోజు రోజుకు పెరుగుతోంది. అడవి ప్రాంతం నుంచి ప్రయాణించేందుకు కూడా గ్రామీణ జనం భయపడుతున్నారు. ఎప్పుడు... ఎక్కడి నుంచి పులి దాడి చేస్తుందో తెలియక వణికిపోతున్నారు. తాజాగా ఆరు పెద్ద పులులు ఓ పశువుల మందపై దాడి చేశాయి.  

ముత్తారం మండలంలో ఆరు పెద్ద పులులు..ఆందోళనలో గ్రామస్థులు
Follow us on

ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పులల సంచారం రోజు రోజుకు పెరుగుతోంది. అడవి ప్రాంతం నుంచి ప్రయాణించేందుకు కూడా గ్రామీణ జనం భయపడుతున్నారు. ఎప్పుడు… ఎక్కడి నుంచి పులి దాడి చేస్తుందో తెలియక వణికిపోతున్నారు. తాజాగా ఆరు పెద్ద పులులు ఓ పశువుల మందపై దాడి చేశాయి.

ముత్తారం మండలం మచ్చుపేట అడవుల్లో ఆరు పెద్ద పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఒకేసారి ఆరు పెద్ద పులులు పశువుల మందపై దాడి చేయగా.. ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు పశువుల కాపరి రాజయ్య తెలిపాడు. మచ్చుపేటకు చెందిన రాజయ్య ఆవుల మందను బహులగుట్టకు మేతకు తీసుకెళ్లాడు.. ఉదయం 9గంటల ప్రాంతంలో ఆరు పులులు ఆవుల మందపై దాడి చేశాయని, కేకలు వేయడంతో ఒక ఆవును చంపి పారిపోయాయని అటవిశాఖ అధికారులకు తెలిపాడు.

రాజయ్య కేకలు విని చుట్టు పక్కల రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ నరసింహరావు, అటవీశాఖ అధికారులతో కలిసి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి చనిపోయిన ఆవును గుర్తించారు. ఘటనకు సంబంధించి రాజయ్య నుంచి పోలీసులు, అటవీశాఖ అధికారులు సమాచారం సేకరించారు. పులులు అటవీప్రాంతంలోనే ఉన్నాయని ఫారెస్ట్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.