Special Trains: దేశంలో మరో ఆరు స్పెషల్‌ ట్రైన్స్‌.. ఈనెల 10 నుంచి కాచిగూడ – విశాఖ ప్రత్యేక రైలు

|

Jan 02, 2021 | 2:20 PM

Special Trains: ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పుడు తాజాగా...

Special Trains: దేశంలో మరో ఆరు స్పెషల్‌ ట్రైన్స్‌.. ఈనెల 10 నుంచి కాచిగూడ - విశాఖ ప్రత్యేక రైలు
Follow us on

Special Trains: ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ మరిన్ని రైళ్లను ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పుడు తాజాగా దేశంలో వివిధ ప్రాంతాల్లో మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇందులో నాలుగు ప్రతి రోజు, రెండు వారానికి మూడు రోజుల పాటు నడుస్తాయని తెలిపింది. అయితే విశాఖపట్నం-కాచిగూడ-విశాఖ మధ్య ప్రత్యేక రైలు ఈనెల 10వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇది కాచిగూడ నుంచి ప్రతి రోజు సాయంత్రం 6.25కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

అలాగే విశాఖపట్నం నుంచి ప్రతి రోజు సాయంత్రం 6.40 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.25 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. అలాగే 10వ తేదీ నుంచి విశాఖ-ముంబాయి ఎల్‌టీఓ -విశాఖ, 15 నుంచి సంబల్‌పూర్‌-నాందేడ్‌-సంబల్‌పూర్‌ మధ్య నాలుగు ఈ ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నట్లు రైల్వే తెలిపింది.

Also Read: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. శ్రీశైలం రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం తేల్చే బాధ్యత సీడబ్ల్యూసీకి అప్పగింత