Simrat Kaur: గొడవైతే వాట్సాప్‌ డీపీ, లాస్ట్‌ సీన్‌ తీసేస్తారు… ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన ‘డర్టీ భామ’..

| Edited By: Pardhasaradhi Peri

Jan 14, 2021 | 7:38 AM

Simrat Kaur InstaPost: 'ప్రేమతో మీ కార్తిక్‌' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది అందాల తార సిమ్రత్‌ కౌర్‌. ఇక తాజాగా ఆహా ఓటీటీలో వేదికగా విడుదలైన 'డర్టీ హరి' చిత్రంతో ఒక్కసారిగా..

Simrat Kaur: గొడవైతే వాట్సాప్‌ డీపీ, లాస్ట్‌ సీన్‌ తీసేస్తారు... ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన డర్టీ భామ..
Follow us on

Simrat Kaur InstaPost: ‘ప్రేమతో మీ కార్తిక్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార సిమ్రత్‌ కౌర్‌. ఇక తాజాగా ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలైన ‘డర్టీ హరి’ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుందీ ముంబై బ్యూటీ. ఈ సినిమాలో సిమ్రత్‌ తన అందం, నటనతో యువతను ఆకట్టుకుంది. ఓవైపు అందాల ప్రదర్శన చేస్తూనే మరోవైపు తనలోని నటనను బయటపెట్టింది. ఇక డర్టీ హరి సినిమా విజయంలో సిమ్రత్‌ కౌర్‌ది ప్రధాన పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్‌ చేసిన ఓ వీడియో నెటిజెన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సాధారణంగా ప్రేమికులు విడిపోతే ఏం చేస్తారు.. బాధతో ఉంటారు. అయితే అలా కాకుండా ప్రేమ విఫలం కాగానే భారతదేశానికి చెందిన ప్రేమికులు మాత్రం.. వెంటనే తమ వాట్సాప్‌ డీపీని తీసేసి, లాస్ట్‌ సీన్‌ను హైడ్‌లో పెట్టేస్తారు.. అనే క్యాప్షన్‌ డిస్‌ప్లే అవుతోన్న వీడియోను షేర్‌ చేసింది సిమ్రత్‌. ఇక ఈ వీడియోతో పాటు ‘మీలో ఎంత మంది గొడవ జరిగాక.. డీపీ (డిస్‌ప్లే పిక్చర్‌)ని మార్చారు’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది.

Also Read: Ravi Teja Khiladi : జోరు పెంచిన మాస్ మహారాజ్.. ‘ఖిలాడి’మూవీ టీజర్ కు డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్ .?