సింహాచల దేవస్థాన పూర్వపు ఈఈ మల్లేశ్వరరావు సస్పెండ్

|

Aug 09, 2020 | 2:18 PM

విశాఖ సింహాచలం దేవస్థానం పాత‌ ఈఈ మల్లేశ్వరరావుపై సస్పెన్ష‌న్ వేటు ప‌డింది. ఈ మేర‌కు ఆలయ ఈవో భ్రమరాంబ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మల్లేశ్వరరావు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆల‌యంలో పనిచేస్తున్నారు.

సింహాచల దేవస్థాన పూర్వపు ఈఈ మల్లేశ్వరరావు సస్పెండ్
Follow us on

Simhachalam temple news : విశాఖ సింహాచలం దేవస్థానం పాత‌ ఈఈ మల్లేశ్వరరావుపై సస్పెన్ష‌న్ వేటు ప‌డింది. ఈ మేర‌కు ఆలయ ఈవో భ్రమరాంబ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మల్లేశ్వరరావు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆల‌యంలో పనిచేస్తున్నారు. కాగా సస్పెన్షన్​కు గల కారణాలను ఈవో వెల్ల‌డించారు.

భైరవవాక ద‌గ్గ‌ర్లోని సింహాచల ఆలయ భూములను ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ నిర్మాణానికి ఓ సంస్థకు లీజుకు ఇచ్చారు. దాని ద్వారా వచ్చే ఆదాయంలో కొంత దేవ‌స్థానానికి చేరేలా అగ్రిమెంట్ ఉంది. కాగా స్కూల్ నిర్మాణ పురోగతికి సంబంధించి దేవస్థానం ఛైర్​పర్సన్ సంచయిత గజపతి ఇటీవల రిపోర్ట్ కోరారు. అయితే ప‌నులు కంప్లీట్ కాకుండానే…పూర్తయినట్లు ఈఈగా ఉన్న మల్లేశ్వరరావు తప్పుడు నివేదిక అంద‌జేశారు. ఈ విషయం గుర్తించి ఆయనను సస్పెండ్ చేశారు.

అయితే దీనిపై మల్లేశ్వరరావు స్పందిస్తూ.. తాను తప్పుడు రిపోర్ట్ ఇవ్వలేదన్నారు. 4 అంతస్థుల బిల్డింగ్ నిర్మించాల్సి ఉండగా.. 3 అంతస్థులు కంప్లీట్ అయ్యాయ‌ని.. తాను ఆ మేర‌కు నివేదిక ఇచ్చినట్లు వెల్లడించారు.

 

Also Read : నల్గొండలో ఘ‌రానా దొంగ‌లు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ