షాకింగ్: ఎల్జీ పాలిమర్స్ బాధితుల్లో కొత్త లక్షణాలు..

|

May 14, 2020 | 2:25 PM

కరోనా కాలంలో తెలుగు రాష్ట్రాల ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది విశాఖ దుర్ఘటన. వైజాగ్‌లోని ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుంచి స్టెరైన్ విషవాయువు వెలువడటంతో ఆ చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల ప్రజలకు తీవ్ర దయనీయ స్థితి ఏర్పడింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా.. సుమారు 516 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఈ ఎల్జీ పాలిమర్స్ బాధితుల్లో కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. కొంతమంది నోట్లో పుండ్లు […]

షాకింగ్: ఎల్జీ పాలిమర్స్ బాధితుల్లో కొత్త లక్షణాలు..
Follow us on

కరోనా కాలంలో తెలుగు రాష్ట్రాల ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది విశాఖ దుర్ఘటన. వైజాగ్‌లోని ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుంచి స్టెరైన్ విషవాయువు వెలువడటంతో ఆ చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాల ప్రజలకు తీవ్ర దయనీయ స్థితి ఏర్పడింది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా.. సుమారు 516 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఈ ఎల్జీ పాలిమర్స్ బాధితుల్లో కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. కొంతమంది నోట్లో పుండ్లు ఏర్పడం వల్ల ఆహారం తీసుకోలేకపోతున్నారు. దీనితో వీరి ఆరోగ్యంపై వైద్య నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వేడి తీవ్రత కారణంగా 15-20 మందికి చర్మం కాలిపోగా.. మరికొందరు తలనొప్పి, కాళ్ళు లాగడం, ఛాతిలో నొప్పి, వికారం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. కాగా, మృతుల కుటుంబాలకు జగన్ ప్రభుత్వం రూ. కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు మంత్రులు చెక్కుల పంపిణీ కూడా చేప‌ట్టారు.

Read This: హిందూ ఆలయంలో అఫ్రిదీ సేవా కార్యక్రమాలు.. ‘సాహో’ అంటున్న నెటిజన్లు