2019లో షిర్డీ సాయినాధుడికి వచ్చిన కానుకల విలువ ఎంతంటే..?

|

Jan 18, 2020 | 9:13 PM

షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. రోజూ వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొంటారు. షిరిడీలోని సాయి మందిరానికి సగటుమ రోజూ 20 వేల మంది సందర్శకులు వస్తారని, కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఈ సంఖ్య లక్షవరకూ ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి. హైదరాబాద్‌లోనూ, తెలంగాణలోనూ సాయిబాబా ఆలయాలున్నాయి. ప్రజలు ఎక్కడికక్కడ ఈ దేవాలయాలను నెలకొల్పుకున్నారు. భారతదేశం వెలుపల […]

2019లో షిర్డీ సాయినాధుడికి వచ్చిన కానుకల విలువ ఎంతంటే..?
Follow us on

షిరిడీలోని సాయి మందిరంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. రోజూ వేల సంఖ్యలో వివిధ ప్రాంతాలనుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకొంటారు. షిరిడీలోని సాయి మందిరానికి సగటుమ రోజూ 20 వేల మంది సందర్శకులు వస్తారని, కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఈ సంఖ్య లక్షవరకూ ఉంటుందని అంచనా.

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని నగరాలలోను, పట్టణాలలోను, చాలా గ్రామాలలోను సాయి మందిరాలున్నాయి. హైదరాబాద్‌లోనూ, తెలంగాణలోనూ సాయిబాబా ఆలయాలున్నాయి. ప్రజలు ఎక్కడికక్కడ ఈ దేవాలయాలను నెలకొల్పుకున్నారు. భారతదేశం వెలుపల అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ వంటి చోట్ల కూడా సాయి బాబా భక్తులు, ఆరాధనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినా కూడా షిర్డి సాయినాథుడిని దర్శించుకోవడానిక దేశ, విదేల్లోని భక్తులు ఆరాటపడుతూ ఉంటారు. వచ్చినవారు కానుకలు కూడా భారీగానే సమర్పిస్తారు. 2019 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకూ భక్తులు 287 కోట్ల విరాళాలు ఇచ్చినట్టు షిరిడీ సంస్థాన్‌ ప్రకటించింది. ఆభరణాలు నాణేల రూపంలో 19కిలోల బంగారం, 391 కిలోల వెండి వచ్చినట్టు సంస్థాన్‌ చెప్పింది.