గబ్బర్ నయా రికార్డ్.. వరుసగా రెండు సెంచరీలు

గబ్బర్ మళ్లీ విజ‌ృంభించాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న పంజాబ్ మ్యాచ్‌లో సెంచరీతో దూసుకుపోయాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు చేసి ఏకైక ఆటగాడిగా శిఖర్ ధావన్ చరిత్ర సృష్టించాడు...

  • Sanjay Kasula
  • Publish Date - 10:26 pm, Tue, 20 October 20
గబ్బర్ నయా రికార్డ్.. వరుసగా రెండు సెంచరీలు

గబ్బర్ మళ్లీ విజ‌ృంభించాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న పంజాబ్ మ్యాచ్‌లో సెంచరీతో దూసుకుపోయాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు చేసి ఏకైక ఆటగాడిగా శిఖర్ ధావన్ చరిత్ర సృష్టించాడు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 61 బంతుల్లోనే 12 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ సరికొత్త రికార్డుల రికార్డుల మోత మోగించాడు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు. ఐపీఎల్‌-13వ సీజన్‌లో సెంచరీని నమోదు చేసుకున్నాడు. కేవలం 61 బంతుల్లో 106 పరుగులు చేశాడు. అంతేకాదు వరుసగా నాలుగోసారి 50+ స్కోరు సాధించాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ధావన్‌ 28 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.