మ‌రోసారి మ‌ద‌ర్ సెంటిమెంట్‌ను సిల్వ‌ర్ స్క్రీన్ పై రిపీట్ చేయనున్న యంగ్ హీరో

|

Nov 26, 2020 | 7:48 AM

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. చివరగా వచ్చిన 96 రీమేక్ 'జాను' నిరాశపరచడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

మ‌రోసారి మ‌ద‌ర్ సెంటిమెంట్‌ను సిల్వ‌ర్ స్క్రీన్ పై రిపీట్ చేయనున్న యంగ్ హీరో
Follow us on

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. చివరగా వచ్చిన 96 రీమేక్ ‘జాను’ నిరాశపరచడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ‘ఆర్ ఎక్స్ 10’0 సినిమాతో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ తోపాటు హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా కంటే ముందు శ్రీకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శర్వానంద్. వీటితోపాటు తెలుగు, తమిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఓ మూవీ కూడా చేస్తున్నాడు . శర్వా కెరియర్ లో 30వ సినిమా గా వస్తున్న ఈ మూవీలో త‌ల్లీకొడుకుల రిలేష‌న్ షిప్ ను అందంగా చూపించ‌నున్న‌ట్టు టాక్‌. ఈ సినిమాకు శ్రీకార్తీక్  దర్శకత్వం వహిస్తున్నాడు. శర్వా తల్లిగా  అక్కినేని అమ‌ల నటిస్తున్నారు.