దేశద్రోహం కేసులో షర్జీల్ ఇమామ్ అరెస్ట్

| Edited By:

Jan 28, 2020 | 5:16 PM

దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి షర్జీల్‌ ఇమామ్‌‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లోని జెహెనాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి నిరసనగా భారత్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాలను విడగొడదామంటూ షర్జీల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో.. ఆయనపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి విడగొట్టాలని వ్యాఖ్యానించినందుకు ఆయనపై ఢిల్లీలో దేశద్రోహం కేసు నమోదు చేశారు. అసోం, మణిపూర్, అరుణాచల్ […]

దేశద్రోహం కేసులో షర్జీల్ ఇమామ్ అరెస్ట్
Follow us on

దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి షర్జీల్‌ ఇమామ్‌‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లోని జెహెనాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి నిరసనగా భారత్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాలను విడగొడదామంటూ షర్జీల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో.. ఆయనపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలను దేశం నుంచి విడగొట్టాలని వ్యాఖ్యానించినందుకు ఆయనపై ఢిల్లీలో దేశద్రోహం కేసు నమోదు చేశారు. అసోం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు కూడా ఆయన ఆయనను తమకు అప్పగించాలని కోరుతున్నాయి.

షర్జీల్‌ ఇమామ్‌‌ రెండు సందర్భాలలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, విభజన ప్రసంగాలు చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పౌరసత్వ వ్యతిరేక సవరణ చట్టం నిరసనల నేపథ్యంలో ఒకసారి జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో, మరొకటి ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఆయన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపించారు.

[svt-event date=”28/01/2020,4:29PM” class=”svt-cd-green” ]