God Shani: శనివారం ఇలా శనిదేవుడిని పూజిస్తే లక్ష్మీ కాటక్షం మీ వెంటే.. పూజ చేసే విధానం ఎలాగంటే..

|

Jan 08, 2021 | 6:34 PM

శనిదేవుడికి మరోకపేరు న్యాయదేవుడు. మనుషులు వారు చేసే కర్మల ప్రకారంగానే శని ఫలితాన్ని ఇస్తాడు అంటారు. శని దేవుని అనుగ్రహం పొందడానికి ఆయనను ఎక్కువగా

God Shani: శనివారం ఇలా శనిదేవుడిని పూజిస్తే లక్ష్మీ కాటక్షం మీ వెంటే.. పూజ చేసే విధానం ఎలాగంటే..
Follow us on

శనిదేవుడికి మరోకపేరు న్యాయదేవుడు. మనుషులు వారు చేసే కర్మల ప్రకారంగానే శని ఫలితాన్ని ఇస్తాడు అంటారు. శని దేవుని అనుగ్రహం పొందడానికి ఆయనను ఎక్కువగా శనివారం ఆధారిస్తారు. ఇక శనిదేవుడికి గురువు పరమేశ్వరుడు. శనివారం రోజు శనిని పూజించే సమయంలో శివుడికి కూడా పూజ చేస్తే.. వారీ సమస్యలు తోలగి, కుటుంబం అకాల మరణం నుంచి విముక్తి పొందుతుంది అంటారు. మరీ శనిదేవుడికి పూజ ఎలా చేయాలో తెలుసుకుందామా..

శనిదేవుడి పూజా విధానం..
శనివారం రోజు నల్ల నువ్వులు మరియు నీళ్ళు శివుడికి సమర్పించి.. ఓం నమః శివాయ అని జపించాలి. ఇలా చేయడం వలన శివుడు మరియు శని ఇరువురు వారిని పూజించిన వారి సమస్యలను తొలగింస్తారని ప్రతీతి. అంతేకాకుండా శనిదేవుడి ముందు ఆవ నూనేతో దీపం వెలిగించి.. నల్ల నువ్వులతో దీపం వెలిగించిన మంచి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా నల్లని వస్త్రాలను ధానం చేయడంతోపాటు, నల్ల కుక్కలకు ఆహారాన్ని అందించాలి. అలాగే ప్రతి శనివారం శని శాంతి మంత్ర స్తుతి అయిన క్రోడం నీలాంజన ప్రఖ్యం అనే మంత్రాన్ని 11 సార్లు పఠిస్తే శని బాధ నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే బియ్యంపిండి, పాలు, బెల్లం, అరటి పండు కలిపి ప్రమిదను తయారు చేయాలి. అందులో ఏడు వత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి. శనివారం శివుడు, విష్ణువులకు ప్రీతికరమైన రోజు. అందుకే వేకువజామునే లేచి తులసి కోట ముందు ఆవు నేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపం వెలిగించాలి. ఇలా చేసిన వారి ఇంట్లో లక్ష్మీ దేవి నిరంతరం కొలువుంటుందని నమ్మకం.