జింక కడుపులో.. 7 కిలోల ప్లాస్టిక్..!

| Edited By:

Nov 26, 2019 | 7:54 PM

ప్లాస్టిక్‌పై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎన్ని అవగాహనలు తీసుకొస్తున్నా.. వాటి వినియోగం మాత్రం ఆగడం లేదు. అంతేకాకుండా.. పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ని బ్యాన్‌ కూడా చేశారు. ముఖ్యంగా.. హైదరాబాద్‌ వంటి మహా నగరాల్లో.. ప్లాస్టిక్ వినియోగం దారుణంగా ఉంది. ఆ ప్లాస్టిక్‌ తిని ఇప్పటికే పలు ఆవులు మృత్యువాత పడ్డాయి. తాజాగా.. ఈ ప్లాస్టిక్ తిని మరో మూగ ప్రాణం మృత్యువాత పడింది. బ్యాంకాక్‌లోని థాయ్‌లాండ్‌లో ప్లాస్టిక్‌ని తిని.. సాధు జంతువైన జింక మరణించింది. ఈ విషయం […]

జింక కడుపులో.. 7 కిలోల ప్లాస్టిక్..!
Follow us on

ప్లాస్టిక్‌పై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎన్ని అవగాహనలు తీసుకొస్తున్నా.. వాటి వినియోగం మాత్రం ఆగడం లేదు. అంతేకాకుండా.. పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ని బ్యాన్‌ కూడా చేశారు. ముఖ్యంగా.. హైదరాబాద్‌ వంటి మహా నగరాల్లో.. ప్లాస్టిక్ వినియోగం దారుణంగా ఉంది. ఆ ప్లాస్టిక్‌ తిని ఇప్పటికే పలు ఆవులు మృత్యువాత పడ్డాయి. తాజాగా.. ఈ ప్లాస్టిక్ తిని మరో మూగ ప్రాణం మృత్యువాత పడింది.

బ్యాంకాక్‌లోని థాయ్‌లాండ్‌లో ప్లాస్టిక్‌ని తిని.. సాధు జంతువైన జింక మరణించింది. ఈ విషయం తెలుసుకున్న సదరు అధికారులు దాన్ని పరిశీలించగా.. షాకింగ్‌ కలిగించేలా.. 7 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. ఉత్తర నాన్ ప్రావిన్స్‌లోని ఖున్ సతాన్ నేషనల్ పార్కులో.. జింక కడుపులో నుంచి ఈ ప్లాస్టిక్ వ్యార్థలను వెలికి తీశారు అధికారులు. ఇందులో.. కాఫీ కప్పులు, నూడుల్స్ బ్యాగ్స్, రబ్బర్ గ్లౌవ్స్, హ్యాండ్ కర్చీఫ్, ప్లాస్టిక్‌ రోప్‌లతో పాటుగా ఓ డ్రాయర్ కూడా బయటపడ్డింది. కాగా.. ఈ జింక వయస్సు 10 సంవత్సరాలు ఉంటుంది.