పుణెలో చైనా ఉద్యోగితో సహా ఏడుగురికి కరోనా..!

|

Jun 18, 2020 | 4:20 PM

పుణె జిల్లా చకన్‌ పట్టణంలోని ఓ చైనా విడిభాగాల సంస్థలో కరోనా కలకలం సృష్టించింది. కంపెనీలో పని చేస్తున్న ఆ దేశ జాతీయుడితో సహా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

పుణెలో చైనా ఉద్యోగితో సహా ఏడుగురికి కరోనా..!
Follow us on

కరోనా వైరస్ విజృంభణ మహారాష్ట్రలో కొనసాగుతూనే ఉంది. తాజాగా చైనా దేశస్థుడి కాంటాక్ట్ తో పుణెకు చెందిన ఏడుగురు కరోనా బారినపడ్డారు.
పుణె జిల్లా చకన్‌ పట్టణంలోని ఓ చైనా విడిభాగాల సంస్థలో కరోనా కలకలం సృష్టించింది. కంపెనీలో పని చేస్తున్న ఆ దేశ జాతీయుడితో సహా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఖేడ్‌ తహసీల్ధార్ డాక్టర్‌ బలరాం గడావే తెలిపారు. చైనా స్పేర్ పార్ట్స్ తయారీ సంస్థలో చైనాతో పాటు మహారాష్ట్రకు చెందిన ౩౦౦ మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన ఓ వ్యక్తి గతవారం పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో మిగతా అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఆరుగురు చైనా జాతీయులతో పాటు మరో 130 మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. వైరస్‌ బారినపడ్డ వారందరిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్న అధికారులు.. లాక్‌డౌన్‌ అమలుకు ముందే చైనా ఉద్యోగులు చకన్‌ ప్లాంట్‌లో ఇరుక్కు పోయినట్లు అధికారులు పేర్కొన్నారు.