చిన్నారుల లైంగిక వేధింపుల కేసులకు ప్రత్యేక కోర్టులు

| Edited By: Anil kumar poka

Jul 26, 2019 | 11:37 AM

రోజురోజుకు పెరిగిపోతున్న లైంగిక నేరాలపై సుప్రీం కోర్టు స్పందించింది. వీటిలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలపై సుప్రీం కోర్టు కీలక అదేశాలు జారీచేసింది. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై పోక్స్ చట్టం ప్రకారం నమోదు చేస్తున్న కేసుల సత్వర పరిష్కారం దిశగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశింది. ఎక్కడైనా ఇలాంటి కేసుల్లో వంద ఎఫ్ఐఆర్లు నమోదైన జిల్లాల్లో పూర్తిగా కేంద్ర నిధులతో 60 రోజుల్లోపు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. […]

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులకు ప్రత్యేక కోర్టులు
Follow us on

రోజురోజుకు పెరిగిపోతున్న లైంగిక నేరాలపై సుప్రీం కోర్టు స్పందించింది. వీటిలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలపై సుప్రీం కోర్టు కీలక అదేశాలు జారీచేసింది. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై పోక్స్ చట్టం ప్రకారం నమోదు చేస్తున్న కేసుల సత్వర పరిష్కారం దిశగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశింది. ఎక్కడైనా ఇలాంటి కేసుల్లో వంద ఎఫ్ఐఆర్లు నమోదైన జిల్లాల్లో పూర్తిగా కేంద్ర నిధులతో 60 రోజుల్లోపు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రత్యేక కోర్టుల్లో కేవలం పోక్స్ కేసులను మాత్రమే విచారించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ ప్రత్యేక న్యాయస్ధానాల్లో జడ్జీల నియామకం, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బంది, చిన్నారులకు అనుకూలంగా ఉండే కోర్టు భవనాల్లో మౌలిక వసతులు.. ఇవన్నీ కేంద్ర నిధుల ద్వారానే జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే విధంగా చిన్నపిల్లలపై లైంగిక వేధింపులపై శిక్షార్హమని అవగాహన కల్పించేలా అన్ని సినిమా ధియేటర్లలోనూ, అన్ని టీవీ చానళ్లలోనూ తప్పనిసరిగా ఆ క్లిప్పింగ్‌ను చూపాలని స్పష్టం చేసింది. ఒక వీడియో ప్రదర్శించాలని ఆదేశించింది.