serum emergency use approval: కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ‘సీరమ్‌’కు అనుమతులు వస్తాయా.?

|

Dec 30, 2020 | 3:02 PM

Serum Institute emergency use approval of vaccine: దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఇటీవల దరఖాస్తు చేసుకుంది..

serum emergency use approval: కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ‘సీరమ్‌’కు అనుమతులు వస్తాయా.?
Follow us on

Serum Institute emergency use approval of vaccine: దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఇటీవల దరఖాస్తు చేసుకుంది. అయితే తాజాగా సీరమ్ సంస్థ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ ఆమోదం విషయాన్ని నిపుణుల బృందం బుధవారం పరిశీలచనుంది. ఈ విషయంపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ అదార్ పూనవల్లా స్పందిస్తూ.. ‘ఈ వార్త మాకు చాలా ప్రోత్సాహానిస్తోంది. భారతీయ నియంత్రణ మండలి నుంచి వ్యాక్సిన్ తుది ఆమోదం కోసం మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకా ప్రయోగాలు భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థగా గుర్తింపు పొందిన సీరమ్.. ఆక్స్‌ఫర్డ్ టీకా కొవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అత్యవసర వినియోగానికి ధరఖాస్తు చేసుకుంది. మరి ఈ వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర పడుతుందో లేదో చూడాలి.

Also read: 2020 Round up: కొవిడ్19 గురించి మీకు ఈ విషయాలు తెలుసా.? ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై ఓ రౌండ్ వేద్దాం..