టీమిండియా సెలక్షన్ కమిటీపై ఆరోపణలు

|

Jul 14, 2020 | 11:09 AM

టీమిండియా, బెంగాల్ రంజీ ఆటగాడు మనోజ్‌ తివారీ భారత సెలక్షన్ కమిటీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా జట్టు ఎంపికలో ప్రాంతీయతకు ప్రాధన్యత ఇస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించాడు. టీమిండియా సెలక్షన్ కమిటీ చీఫ్‌ సెలక్టర్‌ సొంత ప్రాంతానికి చెందిన క్రికెటర్లకే తొలి ప్రధాన్యత ఇస్తున్నారని విమర్శించాడు. సిరీస్‌ల కోసం టీమిండియా జట్టుకు ఎంపిక చేసే సెలక్షన్‌ కమిటీ సమావేశాలను టెలివిజన్‌లో లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్‌ చేశాడు. ఐపీఎల్ తరహాలో ఎంపిక ఉండాలని అన్నాడు. ఆటగాళ్లను ఏ […]

టీమిండియా సెలక్షన్ కమిటీపై ఆరోపణలు
Follow us on

టీమిండియా, బెంగాల్ రంజీ ఆటగాడు మనోజ్‌ తివారీ భారత సెలక్షన్ కమిటీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా జట్టు ఎంపికలో ప్రాంతీయతకు ప్రాధన్యత ఇస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించాడు. టీమిండియా సెలక్షన్ కమిటీ చీఫ్‌ సెలక్టర్‌ సొంత ప్రాంతానికి చెందిన క్రికెటర్లకే తొలి ప్రధాన్యత ఇస్తున్నారని విమర్శించాడు.

సిరీస్‌ల కోసం టీమిండియా జట్టుకు ఎంపిక చేసే సెలక్షన్‌ కమిటీ సమావేశాలను టెలివిజన్‌లో లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్‌ చేశాడు. ఐపీఎల్ తరహాలో ఎంపిక ఉండాలని అన్నాడు. ఆటగాళ్లను ఏ పద్ధతి ప్రకారం కమిటీ ఎంపిక చేస్తుందో తెలుసుకోవడానికి ఇదొక్కటే పరిష్కారం అని మనోజ్‌ తివారీ అభిప్రాయపడ్డాడు. సెలక్షన్‌ కమిటీ వైఫల్యం వల్లే గతేడాది వరల్డ్‌కప్‌లో భారత్‌ కోల్పోయిందని తివారీ మండిపడ్డాడు. నాలుగేళ్ల సమయం దొరికినప్పటికీ జట్టులో ఫోర్త్ ప్లేస్ ను భర్తీ చేయలేకపోయిందని అసహనం వ్యక్తం చేశాడు.