Drugs Seized: ఏం ఐడియారా బాబు..! పొత్తి కడుపులో దాచి రవాణా చేస్తున్న డ్రగ్స్‌ను పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

|

Jan 02, 2021 | 7:42 PM

Drugs Seized: డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఏ మాత్రం దాగడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్‌ను రకరకాలుగా రవాణా చేసినా...

Drugs Seized: ఏం ఐడియారా బాబు..! పొత్తి కడుపులో దాచి రవాణా చేస్తున్న డ్రగ్స్‌ను పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు
Follow us on

Drugs Seized: డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఏ మాత్రం దాగడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్‌ను రకరకాలుగా రవాణా చేసినా.. ఎట్టకేలకు పట్టుబడిపోతున్నారు. తాజాగా అలాంటిదే జరిగింది. డ్రగ్స్‌ను పొత్తికడుపులో దాచుకుని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి కస్టమ్స్‌ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

హెరాయిన్‌గా అనుమానిస్తున్న 635.5 గ్రాముల మాదకద్రవ్యాలతో కూడిన మొత్తం 89 ప్లాస్టిక్‌ గుళికలను ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఆప్ఘన్‌ కు చెందిన వ్యక్తి నుంచి ఈ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. అయితే అతని కదలికలు అనుమానంగా ఉండటంతో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అతని శరీరం పరిశీలించగా, డ్రగ్స్‌ పొత్తి కడుపులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైద్య విధానం ద్వారా వాటిని బయటకు తీశారు. 89 ప్లాస్టిక్‌ గుళికలతో ఉన్న హెరాయిన్‌గా అనుమానిస్తున్నారు. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఆరా తీస్తున్నారు.

 

Online Loan Apps: లోన్‌ యాప్‌ కేసుల్లో తవ్వేకొద్ది బయటపడుతున్న నిజాలు.. కీలక నిందితుడు నాగరాజే..!