బీహార్‌లో రేపే రెండోదశ పోలింగ్‌… “సర్వం సిద్దం”

|

Nov 02, 2020 | 8:11 PM

బీహార్‌లో రెండోదశ పోలింగ్‌కు సర్వం సిద్దమయ్యింది. 94 స్థానాల్లో మంగళవారం పోలింగ్‌ జరుగుతుంది. 2 కోట్ల 85 లక్షల మంది ఓటర్లు 1416 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు . 17 జిల్లాల్లో ఈ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. పశ్చిమ చంపారన్‌ ...

బీహార్‌లో రేపే రెండోదశ పోలింగ్‌... సర్వం సిద్దం
Follow us on

Bihar Election Phase 2 Tomorrow : బీహార్‌లో రెండోదశ పోలింగ్‌కు సర్వం సిద్దమయ్యింది. 94 స్థానాల్లో మంగళవారం పోలింగ్‌ జరుగుతుంది. 2 కోట్ల 85 లక్షల మంది ఓటర్లు 1416 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు . 17 జిల్లాల్లో ఈ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. పశ్చిమ చంపారన్‌ , తూర్పు చంపారన్‌ ,సీతామారి , మధుబని, దర్బాంగా, ముజఫర్‌పూర్‌, గోపాల్‌గంజ్‌ తదితర జిల్లాల్లో పోలింగ్‌ జరుగుతోంది.

తొలిదశ పోలింగ్‌లో 55.68 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. ఎన్నికల సంఘం 41,362 పోలింగ్‌బూత్‌లను ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. నక్సల్‌ ప్రభావిత జిల్లాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగుస్తుంది. రెండోదశ పోలింగ్‌ మహాఘట్‌బంధన్‌ సీఎం అభ్యర్ధి తేజస్వియాదవ్‌తో పాటు ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్‌యాదవ్‌ కూడా బరిలో ఉన్నారు.

తేజస్వియాదవ్‌ వైశాలి జిల్లా లోని రఘోపూర్‌ నియజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తేజ్‌ప్రతాప్‌యాదవ్‌ హసన్‌పూర్‌ నుంచి బరిలో ఉన్నారు. ఈసారి ఎన్నికలు జరుగుతున్న 94 స్థానాల్లో బీజేపీ 46 స్థానాల్లో పోటీ చేస్తోంది. 44 స్థానాల్లో జేడీయూ పోటీ చేస్తోంది.