ముదురుతోన్న వివాదం.. సీఎస్​ నీలం సాహ్నికి.. నిమ్మగడ్డ మరో లేఖ..ఏపీలో లోకల్ వార్

| Edited By: Rajesh Sharma

Nov 19, 2020 | 3:57 PM

ఏపీ ఎన్నికల సంఘం, జగన్ సర్కార్ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల వివాదం ముదురుతోంది. ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, పంచాయతీరాజ్‌ అధికారులతో..

ముదురుతోన్న వివాదం.. సీఎస్​ నీలం సాహ్నికి.. నిమ్మగడ్డ మరో లేఖ..ఏపీలో లోకల్ వార్
Follow us on

ఏపీ ఎన్నికల సంఘం, జగన్ సర్కార్ మధ్య స్థానిక సంస్థల ఎన్నికల వివాదం ముదురుతోంది. ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, పంచాయతీరాజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు కోసం ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మరోసారి సీఎస్‌కు నీలం సాహ్నికి లేఖ రాశారు. బుధవారం జరగాల్సిన మీటింగ్ వాయిదా పడటంతో.. గురువారం మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన ఎస్​ఈసీ.. ఆ సమావేశానికి అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎస్​ను కోరారు.

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అధికారులకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు, అనుమతులు రాకపోవడంతో వారిలో గందరగోళం నెలకొంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీటింగ్ నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న ఎస్​ఈసీ.. అందుకు తగ్గట్లు తన ఆఫీసులో ఏర్పాట్లు చేశారు. కాగా కలెక్టర్లకు ..ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో బుధవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ఎస్‌ఈసీ కార్యాలయం ఏర్పాట్లు చేసింది. సమావేశం‌ నిర్వహించేందుకు 12 గంటల వరకు వెయిట్ చేస్తామని, అప్పటిలోగా అధికారులు పాల్గొనకపోతే గవర్నమెంట్ నుంచి అనుమతి రానట్టు భావించాల్సి ఉంటుందని ఎస్‌ఈసీ కార్యాలయ అధికారులు చెబుతున్నారు.

Also Read :

రైట్, రైట్.. డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి ఆర్టీసీ అద్దె బస్సులు

శ్రీశైల మల్లన్న ప్రసాదం మరింత ప్రియం..మళ్లీ పెరిగిన లడ్డూ ధర

విజయనగరం మన్యంలో వింత వ్యాధి, గిరిజనుల వరుస మరణాలు