స్టాట్యూ ఆఫ్ యూనిటీకి సీప్లేన్ సేవలు

|

Oct 26, 2020 | 8:54 PM

స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద మరిన్ని సేవలు ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ నుంచి నర్మదా జిల్లాలోని కెవడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీకి సీప్లేన్ సేవలు ప్రారంభం కానున్నాయి.

స్టాట్యూ ఆఫ్ యూనిటీకి సీప్లేన్ సేవలు
Follow us on

Seaplane Will Connect Sabarmati : స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద మరిన్ని సేవలు ప్రారంభం కానున్నాయి. అహ్మదాబాద్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ నుంచి నర్మదా జిల్లాలోని కెవడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీకి సీప్లేన్ సేవలు ప్రారంభం కానున్నాయి. సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ప్రధాని మోదీ సీప్లేన్ సేవలను ప్రారంభించనున్నారు.

మాల్దీవుల నుంచి కేరళలోని కొచ్చీకి చేరుకున్న సీప్లేన్  గుజరాత్‌కు చేరుకున్నాయి. రీజినల్ కనెక్టివిటీలో భాగంగా ఈ సీప్లేన్‌ను ప్రవేశపెట్టారు. 19 – సీటర్‌గా ఉన్న ఈ సీప్లేన్‌ను స్పైస్‌జెట్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ ప్లేన్‌లో ప్రయాణించాలంటే ఒక్కో ప్యాసెంజర్ రూ. 4,800 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి 12 మంది ప్యాసెంజర్లు ఇందులో ప్రయాణించడానికి అవకాశం ఉంది.

అహ్మదాబాద్ నుంచి కెవాడియాకు మధ్య 200 కిలో మీటర్ల దూరం ఉంది. సీప్లేన్ ద్వారా 45 నిమిషాల్లోనే ఒకచోట నుంచి మరో చోటికి చేరుకోవచ్చు. రోజుకు నాలుగు సార్లు సీప్లేన్ సేవలను అందించనున్నట్టు స్పైస్‌జెట్ సంస్థ అధికారులు తెలిపారు. కాగా.. 182 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ గుర్తింపు పొందింది. ఇక సీప్లేన్ సేవలతో ఈ ప్రాంతం ఇటు స్థానికులతో పాటు అంతర్జాతీయ పర్యటకులను మరింత ఆకర్షించనుంది.