తేలు కుడితే అదిరిపోయే మంట..కానీ తేలు విషంతో కాసుల పంట

|

Dec 28, 2019 | 11:50 AM

తేలు..అత్యంత విషకరమైన జీవి. దీని కాటు వలన ప్రాణాలు కొల్పోయిన ఘటనలు కోకొల్లలు. అయితే తేలు జాతి ప్రాణాలు తీయడమే కాదు, కొన్ని రకాల వ్యాధులు నుంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. కాస్త షాకింగ్‌గా ఉండొచ్చు కానీ ఇది ఫాక్ట్. మనుషులకు వచ్చే అనేక రకాల కీళ్ల సంబంధిత వ్యాధులకు తేలు విషం సంజీవనిలా పనిచేస్తుందట. ఈ విషయాన్ని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనల్లో తేటతెల్లమైంది. దీంతో తేలు విషం ధర ఒక్కసారిగా […]

తేలు కుడితే అదిరిపోయే మంట..కానీ తేలు విషంతో కాసుల పంట
Follow us on

తేలు..అత్యంత విషకరమైన జీవి. దీని కాటు వలన ప్రాణాలు కొల్పోయిన ఘటనలు కోకొల్లలు. అయితే తేలు జాతి ప్రాణాలు తీయడమే కాదు, కొన్ని రకాల వ్యాధులు నుంచి ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. కాస్త షాకింగ్‌గా ఉండొచ్చు కానీ ఇది ఫాక్ట్. మనుషులకు వచ్చే అనేక రకాల కీళ్ల సంబంధిత వ్యాధులకు తేలు విషం సంజీవనిలా పనిచేస్తుందట. ఈ విషయాన్ని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనల్లో తేటతెల్లమైంది. దీంతో తేలు విషం ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. కానీ చాలా తక్కువ మోతాదులో తేళ్ల దగ్గర విషం అభిస్తుంది. దానిని సేకరించడం కూడా అత్యంత ప్రమాదకం.

అందుకే బయట మార్కెట్‌లో ఒక గ్రాము తేలు విషం రూ 7,30,000 ఉంది. అంటే ఒక లీటర్ తేలు విషం దాదాపు  రూ. 73 కోట్ల వరకు ఉంటుంది. తేలు విషంలో కాంపొనెంట్స్ ఉంటాయి. వీటితో తయారు చేసిన మందుతో సుమారు 13 లక్షల మంది కీళ్ల రుగ్మతలు కలిగిన వ్యక్తులపై ప్రయోగం చేశారు. ఈ పరిశోధనలకు ఊహించని సక్సెట్ రేట్ రావడంతో ..సదరు ఔషధం మార్కెట్లోకి విడుదలయ్యింది. మరో విషయం ఏంటంటే తేలు విషంతో తయారుచేసిన మెడిసిన్ వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దరిచేరవు.