ఈనెల19 నుంచి పంజాబ్‌లో స్కూల్స్ ఓపెన్

|

Oct 16, 2020 | 11:56 AM

కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన రంగాలు ఇప్పుడిప్పుడే తెరుకుంటున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఒక్క క్లాసు కూడా జరగకుండానే తరగతి గదులకు తాళాలు పడ్డాయి. కరోనా తీవ్ర కాస్త తగ్గుముఖం పట్టడంతో కేంద్రం అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించింది.

ఈనెల19 నుంచి పంజాబ్‌లో స్కూల్స్ ఓపెన్
Follow us on

కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన రంగాలు ఇప్పుడిప్పుడే తెరుకుంటున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఒక్క క్లాసు కూడా జరగకుండానే తరగతి గదులకు తాళాలు పడ్డాయి. కరోనా తీవ్ర కాస్త తగ్గుముఖం పట్టడంతో కేంద్రం అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించింది. దీంతో అయా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను తిరిగి తెరిపించేందుకు అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను పునర్ ప్రారంభించాలని పంజాబ్ సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ నెల 19వతేదీ నుంచి పాఠశాలలను పునర్ ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ ఇందర్ సింగ్లా చెప్పారు. కంటైన్మెంటు జోన్ల బయట ఉన్న పాఠశాలలను మాత్రమే తెరవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా 9 నుంచి 12వతరగతి విద్యార్థుల వరకు తరగతులు ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పాఠశాలలు తెరవాలని మంత్రి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటిస్తూ విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు.

పాఠశాలలకు వచ్చే పిల్లలు పూర్తిగా దుస్తులు ధరించి స్కూళ్లకు రావాలని మంత్రి సూచించారు. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు కేవలం మూడు గంటలపాటు మాత్రమే పాఠశాలలను రెండు షిప్టు పద్ధతిలో నడుపుతామని మంత్రి చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలోని విద్యార్థులు పాఠశాలలకు రావద్దన్నారు మంత్రి. పాఠశాలల్లో విద్యార్థులు చేతులు కడుక్కునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, థర్మల్ స్కానింగ్ చేయాలని మంత్రి ఆదేశించారు. స్కూలు బస్సుల్లో శానిటైజర్లను పెట్టాలని, దూరం పాటించాలని కోరారు.