పూరి జగన్నాథ ‘రథయాత్ర’కు సుప్రీంకోర్టు అనుమతి!

| Edited By:

Jun 22, 2020 | 4:41 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ రథయాత్రకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఒడిశాలోని జగన్నాథ్ రథయాత్రని

పూరి జగన్నాథ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి!
Follow us on

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ రథయాత్రకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఒడిశాలోని జగన్నాథ్ రథయాత్రని నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ సుప్రీంకోర్టు లో కేంద్రం పిటిషన్లు దాఖలు చేసింది. దాఖలు అయిన నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడలేం అని ధర్మాసనం స్పష్టం చేస్తూ.. ప్రజల ఆరోగ్యం తో రాజీ పడకుండా ఆలయ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో పూరి జగన్నాథ్ రథయాత్ర జరుగుతుందని తీర్పు వెల్లడించింది. కొన్ని నిబంధనల తో కూడిన అనుమతిని సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అయితే ప్రజలు పాల్గొనకుండా రథయాత్ర జరుపుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

[svt-event date=”22/06/2020,4:41PM” class=”svt-cd-green” ]

Also Read: ప్రపంచానికే భారత్ ఓ గొప్ప ఔషధాలయం..!