కస్టమర్లకు ఎస్బీఐ హెచ్చరిక.. ఫిబ్రవరి 28న ఖాతా క్లోజ్!

| Edited By:

Feb 04, 2020 | 10:03 AM

SBI Bank Customers Alert: ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా’ తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. కేవైసీ ప్రక్రియను ఫిబ్రవరి 28లోగా అప్‌డేట్ చేసుకోవాలని.. లేదంటే బ్యాంకింగ్ సర్వీసులకు ఆటంకం కలుగుతుందని సంస్థ సూచించింది. పాస్‌పోర్ట్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎన్‌పీఆర్ లెటర్‌లలో ఏదైనా ఒక డాక్యుమెంట్స్‌ను దగ్గరలో ఉన్న బ్యాంకులో సమర్పించి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని లేదంటే బ్యాంక్ అకౌంట్లను ఆపేస్తామంటూ […]

కస్టమర్లకు ఎస్బీఐ హెచ్చరిక.. ఫిబ్రవరి 28న ఖాతా క్లోజ్!
Follow us on

SBI Bank Customers Alert: ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా’ తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. కేవైసీ ప్రక్రియను ఫిబ్రవరి 28లోగా అప్‌డేట్ చేసుకోవాలని.. లేదంటే బ్యాంకింగ్ సర్వీసులకు ఆటంకం కలుగుతుందని సంస్థ సూచించింది. పాస్‌పోర్ట్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎన్‌పీఆర్ లెటర్‌లలో ఏదైనా ఒక డాక్యుమెంట్స్‌ను దగ్గరలో ఉన్న బ్యాంకులో సమర్పించి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని లేదంటే బ్యాంక్ అకౌంట్లను ఆపేస్తామంటూ కస్టమర్లలను హెచ్చరించింది.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు తమ కస్టమర్ల కేవైసీ డీటెయిల్స్‌ను ప్రతీసారి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కస్టమర్ కేవైసీ వివరాలైనా పెండింగ్‌లో ఉంటే.. వారికి ఎస్‌ఎంఎస్ ద్వారా అలెర్ట్ పంపాలి. అంతేకాక బ్యాంకులు కస్టమర్ కేవైసీ నిబంధనలు అతిక్రమిస్తే.. ఆర్బీఐ భారీ జరిమానాలు విదిస్తుంది. కాగా, వాణిజ్య బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు, మైక్రోఫైనాన్స్ సంస్థలు కూడా ఈ ఆర్బీఐ నిబంధనలు వర్తిస్తాయి.