Breaking: భారత్‌కి రాకపోకలను నిషేధించిన దుబాయి

| Edited By:

Sep 23, 2020 | 4:25 PM

దుబాయి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కి రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది

Breaking: భారత్‌కి రాకపోకలను నిషేధించిన దుబాయి
Follow us on

Saudi Arabia India: దుబాయి పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కి రాకపోకలను నిషేధిస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. భారత్‌తో పాటు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాలకు ఈ నిషేధం ఉన్నట్లు వెల్లడించింది. అలాగే దుబాయికి రావడానికి 14 రోజులలోగా పై మూడు దేశాలకు వెళ్లినట్లు ప్రయాణ చరిత్ర ఉన్న వారిపై కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఈ నిషేధం ఎన్ని రోజులు ఉంటుందన్న విషయంపై మాత్రం స్పష్టతను ఇవ్వలేదు. కాగా కరోనా కేసుల నేపథ్యంలో ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలపై కూడా దుబాయి నిషేధం విధించింది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 3 వరకు తమ సర్వీస్‌ షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రీషెడ్యూల్ అయినట్టుగా మెసేజ్‌లు వచ్చినట్టు ప్రయాణికులు చెబుతున్నారు.