కామెంట్రీ బాక్స్‌లోకి ఒకరు వివాదాస్పద కామెంట్రేటర్.. మరొకరు చమత్కారాల వీరుడు

|

Nov 19, 2020 | 4:51 PM

భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో సంజయ్ మంజ్రేకర్ గొంతు వినిపించనుంది. గత మార్చి నెల నుంచి కామెంట్రీకి దూరంగా ఉన్న మంజ్రేకర్ ధర్మశాలలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కామెంట్రీ చెప్పలేదు...

కామెంట్రీ బాక్స్‌లోకి ఒకరు వివాదాస్పద కామెంట్రేటర్.. మరొకరు చమత్కారాల వీరుడు
Follow us on

Sanjay Manjrekar Will be Back : భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో సంజయ్ మంజ్రేకర్ గొంతు వినిపించనుంది. గత మార్చి నెల నుంచి కామెంట్రీకి దూరంగా ఉన్న మంజ్రేకర్ ధర్మశాలలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కామెంట్రీ చెప్పలేదు.

అయితే.. ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కే కామెంట్రీ ప్యానెల్ ఎంపిక సహా ఇతర నిర్ణయాలను తీసుకునే హక్కుంది. మంజ్రేకర్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా కామెంట్రీ ప్యానెల్లో చేర్చే అవకాశం ఉంది. దీంతో గత మార్చి నెల నుంచి ఖాళీగా ఉంటున్న మంజ్రేకర్.. ఇకపై బిజీబిజీ కానున్నాడు. తన వ్యాఖ్యానంతో అభిమానులను అలరించనున్నాడు.

సంజయ్ మంజ్రేకర్‌‌తో పాటు గ్లెన్ మెక్‌గ్రాత్, నిక్ నైట్, హర్షా భోగ్లే, అజయ్ జడేజా, మురళీ కార్తీక్, అజిత్ అగార్కర్ కూడా కామెంట్రీ ప్యానెల్‌లో ఉండనున్నారు. 2016లో కామెంటేటర్‌గా కెరీర్ ప్రారంభించిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. హిందీ కామెంట్రీ ప్యానెల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. జహీర్ ఖాన్, వజియ్ దహియా, మహ్మద్ కైఫ్, వివేక్ రజ్దాన్, అర్జున్ పండిట్ హిందీ కామెంట్రీ ప్యానెల్‌లో భాగం కాబోతున్నారు. మొత్తానికి సుదీర్ఘ ఆసీస్ పర్యటన సందర్భంగా మంజ్రేకర్‌, సెహ్వాగ్ పునరాగమనం చేయనున్నారు.