సమంతలో ’96’ ఛాయలు!

| Edited By:

Oct 14, 2019 | 9:39 AM

స్టార్ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ’96’. ఈ సినిమాకు తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ’96’ అనే వర్కింగ్ టైటిల్‌తో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో మాతృకను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ తెలుగు వెర్షన్ కూడా తెరకెక్కిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. ఇక హీరోయిన్ సమంత తన పాత్రకు సంబంధించిన షూట్‌ను పూర్తి […]

సమంతలో 96 ఛాయలు!
Follow us on

స్టార్ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ’96’. ఈ సినిమాకు తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ’96’ అనే వర్కింగ్ టైటిల్‌తో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో మాతృకను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ తెలుగు వెర్షన్ కూడా తెరకెక్కిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. ఇక హీరోయిన్ సమంత తన పాత్రకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేసి.. ఓ ఎమోషనల్ ట్వీట్‌ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయాల్సి ఉంది. గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇకపోతే గతంలో మూవీ చిత్రీకరణ సమయంలో హీరో శర్వానంద్‌కు గాయం కాగా.. కొద్దిరోజులు షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.