వాళ్ళ ముందు నేను సాధించింది తక్కువేః సమంతా

|

Dec 29, 2019 | 8:58 PM

ఆమె నవ్వు ఒక మాయ.. చిలిపితనం, కొంటెతనం కలగలిసిన ఆమె వెండితెరపై కనబడితే చాలు ఫ్యాన్స్‌కు మైమరపులా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభిమానులను తన మాయలో పడేసిన నటి సమంత.. రియల్‌గా కూడా ప్రజలకు ఎంతగానో సేవ చేస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్‌ను నడుపుతున్న ఈ మనసున్న భామ ఎంతోమంది చిన్నపిల్లల భవిష్యత్తుకు అండగా నిలుస్తోంది. అందుకే సమంతకు టీవీ9 నవ నక్షత్ర అవార్డును ఇచ్చి సత్కరించింది. ఇక ఈ అవార్డు అందుకున్న సామ్ తన చిలిపి మాటలతో […]

వాళ్ళ ముందు నేను సాధించింది తక్కువేః సమంతా
Follow us on

ఆమె నవ్వు ఒక మాయ.. చిలిపితనం, కొంటెతనం కలగలిసిన ఆమె వెండితెరపై కనబడితే చాలు ఫ్యాన్స్‌కు మైమరపులా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభిమానులను తన మాయలో పడేసిన నటి సమంత.. రియల్‌గా కూడా ప్రజలకు ఎంతగానో సేవ చేస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్‌ను నడుపుతున్న ఈ మనసున్న భామ ఎంతోమంది చిన్నపిల్లల భవిష్యత్తుకు అండగా నిలుస్తోంది. అందుకే సమంతకు టీవీ9 నవ నక్షత్ర అవార్డును ఇచ్చి సత్కరించింది. ఇక ఈ అవార్డు అందుకున్న సామ్ తన చిలిపి మాటలతో అందరిని ఆకట్టుకుంది.

ఎందరో మహామహుల సమక్షంలో ఈ అవార్డు అందుకోవడం తనకు సంతోషంగా ఉందని సమంత చెప్పుకొచ్చింది. అయితే ఈ వేదికపై సత్కారాలు అందుకున్న అన్‌సంగ్ హీరోల స్ఫూర్తిదాయకమైన కథలను చూసిన తర్వాత తాను జీవితంలో సాధించిందేమీ లేదని ఆమె అన్నారు.

ఈ జెనరేషన్‌కు బెస్ట్ రోల్ మోడల్స్ ఎంతగానో అవసరమని.. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారని సమంత చెప్పారు. అంతేకాకుండా ఈ మధ్య బయోపిక్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. ఇలాంటి హీరోల బయోపిక్స్‌లో తాను నటించాలని ఉందని సమంత తన మనసులోని మాటను చెప్పారు.