Samantha Sets Project: అఖిల్‌కు ఆ సినిమా ఆఫర్ రావడం కోసం సామ్ ఏం చేసిందో తెలుసా..

|

Jan 17, 2021 | 12:39 PM

Samantha Sets Project: అక్కినేని వారి కోడలు సమంత మరిది అఖిల్ కెరీర్ కోసం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. అఖిల్‌కు

Samantha Sets Project:  అఖిల్‌కు ఆ సినిమా ఆఫర్ రావడం కోసం సామ్ ఏం చేసిందో తెలుసా..
Follow us on

Samantha Sets Project: అక్కినేని వారి కోడలు సమంత మరిది అఖిల్ కెరీర్ కోసం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. అఖిల్‌కు మంచి హిట్ అందించాలని చూస్తోంది. అందుకోసం తనకు ఓ బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. యంగ్‌ డైరెక్టర్లు రాజ్‌, డీకేలు తీయబోయే సినిమా ప్రాజెక్ట్‌ అఖిల్‌కు వచ్చేలా చేసింది.

ఇప్పటికే సమంత ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్‌ సిరీస్‌ను రాజ్‌ అండ్‌ డీకేలు తెరకెక్కించారు. ఈ క్రమంలో వారు తీయాలనుకుంటున్న ఓ సినిమా కథను సమంతకు వినిపించగా ఆమె చాలా ఇంప్రెస్‌ అయినట్లు తెలిసింది. అయితే ఈ కథ తన మరిది అఖిల్‌కు అయితే బాగా సెట్టవుతుందని చెప్పిందట. అలా ఈ యాక్షన్‌ సినిమాను అఖిల్‌కు వచ్చేలా చేయడంలో సామ్‌ కీలక పాత్ర పోషించిందని సమాచారం. ఇదిలా వుంటే అఖిల్‌ ప్రస్తుతం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

నయనతారకు షాక్ ఇచ్చిన సమంత, అక్కినేనివారి కోడలుకు అసలు సినిమాలు చేసే ఉద్దేశం ఉందా..?

కళ్ళకు గంతలు కట్టుకొని దోశ తిరగేసిన మెగాస్టార్.. సినిమా చూస్తూ ఏడ్చేశానంటున్న చిరంజీవి..