sam jam with mega star streaming: ఓటీటీ రంగంలో సరికొత్త సంప్రదాయానికి తెర తీస్తూ ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’.. అక్కినేని హీరోయిన్ సమంతతో ‘సామ్ జామ్’ అనే టాక్ షో రన్ చేస్తోంది. ఇప్పటి వరకు చాలా మంది తారలు ఈ టాక్ షోలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోలో పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ షోకు సంబంధించిన విడుదలైన ప్రోమోలు మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ను పురస్కరించుకొని చిరుతో జరిగిన ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ను ‘ఆహా’లో మొదలుపెట్టారు.
Here’s the Mega gift to you all for this Christmas?
Mana Megastar chese hungama mamulga undadu ?
Mee andariki inka entertainment mamulga undadu ?Enjoy Streaming #SamJamMegaEpisode ? https://t.co/Z8kmv09cdJ
Megastar @KChiruTweets @Samanthaprabhu2 @thesamjamshow #SamJam pic.twitter.com/3Am60qJsfq
— ahavideoIN (@ahavideoIN) December 24, 2020
ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఆహా’ సంస్థ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో.. ‘ఈ క్రిస్మస్కు మీ అందరికీ మెగా గిప్ట్ను అందిస్తున్నాం. మన మెగా స్టార్ చేసే హంగామా మాములుగా ఉండదు. మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు’ అని పేర్కొంటూ స్ట్రీమింగ్ వీడియో లింక్‌ను షేర్ చేశారు. ఇక దీంతో పాటు ‘మెగాస్టార్ ఎపిసోడ్ స్నీక్ పీక్ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ‘సినిమా అంటేనే మెగాస్టార్’ అంటూ సామ్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.