Saaho: ‘సాహో’ బ్యాడ్‌ గర్ల్.. రెమ్యునరేషన్ వింటే షాక్!

| Edited By: Pardhasaradhi Peri

Aug 20, 2019 | 5:47 PM

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సాహో’ ఫీవర్ ఉంది. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు.. యూట్యూబ్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇది ఇలా ఉండగా నిన్న రిలీజైన బ్యాడ్ బాయ్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో రచ్చ చేస్తూ.. టాప్ 3లో ట్రెండింగ్ అవుతోంది. బాద్షా […]

Saaho: సాహో బ్యాడ్‌ గర్ల్.. రెమ్యునరేషన్ వింటే షాక్!
Follow us on

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సాహో’ ఫీవర్ ఉంది. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు.. యూట్యూబ్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇది ఇలా ఉండగా నిన్న రిలీజైన బ్యాడ్ బాయ్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో రచ్చ చేస్తూ.. టాప్ 3లో ట్రెండింగ్ అవుతోంది. బాద్షా సంగీతం.. ప్రభాస్ మాచో లుక్స్, జాక్విలిన్ అందాలు ఫ్యాన్స్‌ను మతిపోగోట్టిస్తున్నాయి.

ఇక విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాలీవుడ్ రేంజ్‌కు సరిపోయేలా అద్భుతంగా ఉన్నాయి. అయితే జాక్వలిన్‌ ఈ పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇక ఈ శ్రీలంకన్ బ్యూటీ ఈ సాంగ్ కోసం ఏకంగా 2 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఐటెం సాంగ్ కోసం మరో హీరోయిన్ ఎవరూ దొరక్కపోవడం.. టైం కూడా తక్కువ ఉండటంతో నిర్మాతలు జాక్విలిన్ అడిగిన మొత్తాన్ని ఇవ్వాల్సి వచ్చిందని వినికిడి. ఏది ఏమైనా సాంగ్ మాత్రం యూట్యూబ్‌ను షాక్ చేస్తోంది.