టీవీలో రష్యా అధ్యక్షుని తల కనిపించని వైనం, న్యూ ఇయర్ మెసేజ్ ఇస్తుండగా క్రెమ్లిన్‌లో కలకలం

| Edited By: Pardhasaradhi Peri

Jan 04, 2021 | 4:48 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూ ఇయర్  మెసేజ్ ఇస్తుండగా ఆ కార్యక్రమం ఓ టీవీ స్టేషన్ లో అభాసు పాలైంది. ఆయన తల సగం మాత్రమే కనిపిస్తూ ..

టీవీలో రష్యా అధ్యక్షుని తల కనిపించని వైనం, న్యూ ఇయర్ మెసేజ్ ఇస్తుండగా క్రెమ్లిన్‌లో కలకలం
Follow us on

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూ ఇయర్  మెసేజ్ ఇస్తుండగా ఆ కార్యక్రమం ఓ టీవీ స్టేషన్ లో అభాసు పాలైంది. ఆయన తల సగం మాత్రమే కనిపిస్తూ ఈ మెసేజ్ ప్రసారం కావడం పెను వివాదాన్ని రేపింది. కలినిన్ గ్రాడ్ లోని టీవీ స్టేషన్ బాస్ లు చేసిన నిర్వాకమిది.. ముఖ్యంగా నూతన సంవత్సరం సందర్భంగా ఒక దేశాధ్యక్షుడి ప్రసంగం ప్రసారం చేస్తున్నప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన ఆ టీవీ స్టేషన్ అధికారులు ఇలా తమ డొల్లతనాన్ని చాటుకున్నారు. పుతిన్ తల కనిపించకుండా సగభాగం మాత్రమే కనిపించడం తమ తప్పిదమేనని  వారు ఒప్పుకున్నారు. పైగా ఇది సాంకేతిక పొరబాటని, ఇందులో రాజకీయమేమీ లేదని వివరణ ఇచ్చుకున్నారు. డిసెంబరు 31 అర్ధరాత్రికి కొన్ని నిముషాల ముందు ప్రసారమైన ఈ  కార్యక్రమం కొంత భాగం ప్రజల్లోకివెళ్లి అంతా ఆశ్చర్యపోయారు. బ్రిటన్ లో రాణి ఎలిజిబెత్ క్రిస్మస్ సందర్భంగా ఇచ్ఛే మెసేజ్ తో సమానంగా ఈ సందేశాన్ని కూడా పరిగణిస్తారు.

Video Courtesy: MailOnline

ఇక ఈ టీవీ బాసులు తమ పొరబాటు గ్రహించి టీవీ .ఇంటర్నెట్ లో మధ్యలోనే దీన్ని ఆపేసి ఆ సమయాన్ని మ్యూజిక్ తో లాగించేశారు. ఏమైనా దీనిపై ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఈ సోకాల్డ్ టీవీ అధికారులను శిక్షిస్తామని పై అధికారులు చెబుతున్నా ..ఇందుకు బాధ్యులైనవారు మాత్రం క్షమాపణ చెప్పని విషయం గమనార్హం.

Also Read:

ఘన్‌పూర్‌ తల్లీకొడుకుల హత్య కేసులో వెలుగుచూసిన సంచలన నిజాలు.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

Swamy Meets Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం కోసం ఆధ్యాత్మిక గురువు ప్రత్యేక పూజలు.. ఎక్కడంటే.. ?

Surabi Medical College : సిద్ధిపేట మెడికల్‌ కాలేజ్‌ అడ్మిషన్ల ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..