Corona effect కరోనా ప్రభావంతో రూపాయి వాల్యూ ఢమాల్

|

Apr 17, 2020 | 5:24 PM

దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం చేయని రంగమంటూ లేని పరిస్థితి కనిపిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ అయితే కుదేలైపోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో...

Corona effect కరోనా ప్రభావంతో రూపాయి వాల్యూ ఢమాల్
Follow us on

దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం చేయని రంగమంటూ లేని పరిస్థితి కనిపిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ అయితే కుదేలైపోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో రూపాయి విలువ రోజురోజుకూ దారుణంగా పడిపోతోంది. గతంలో ఎన్నడూ లేని స్థాయికి రూపాయి విలువ పడిపోయిందంటే అతిశయోక్తి లేదు. తాజాగా రూపాయ వాల్యూ డాలర్ మారకంతో పోలిస్తే.. 77 రూపాయలకు పడిపోయింది.

అమెరికన్ డాలర్‌తో రూపాయ మారకం విలువ 77 రూపాయలకు పడిపోయింది. దాంతో విదేశాలలో విద్యనభ్యసించేందుకు వెళ్ళి డాలర్ల రూపంలో యూనివర్సిటీ ఫీజులు చెల్లిస్తున్న విద్యార్థుల పరిస్థితి దారుణ స్థితికి చేరుకుంటోంది. గురువారం సాయంత్రం రూపాయి మారకం విలువ 76 రూపాయల 87 పైసలుండగా.. శుక్రవారం అది 77 రూపాయలను దాటిపోయింది. ఫారెక్సు డీలర్లను తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వున్న పరిస్థితులను పరిశీలిస్తే రూపాయి పతనం మరికొంత కాలం కొనసాగుతుందని, బహుశా రెండు, మూడు రోజుల్లోనే రూపాయి మారకం విలువ 80 రూపాయలను దాటిపోయే పరిస్థితి కనిపిస్తుందని వారంటున్నారు.

రెండో దశ లాక్ డౌన్ ప్రారంభం నుంచే రూపాయి పతనం వేగవంతమైందని విదేశీ మారకద్రవ్యాన్ని ఆధారం చేసుకుని లావాదేవీలు జరిపే సంస్థలు చెబుతున్నాయి. ఇండోనేషియన్ రూపయ్యా కూడా ఇండియన్ రూపాయిలాగానే తీవ్రస్థాయిలో పతనం అవుతుందని అంటున్న నిఫుణులు.. అమెరికాలో కరోనా ప్రభావం దృష్ట్యా కొంత మేరకు ఇండియన్ రూపాయికి ప్రయోజనం వుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.