తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ బస్సులపై ఆర్డీఏ కొరడా

| Edited By:

Jun 15, 2019 | 10:07 AM

తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ వాహనాలపై ఆర్డీఏ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలు పాటించని స్కూల్ వాహనాలపై వారు దాడులు నిర్వహించారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఉదయం నుంచి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటివరకు 152 బస్సులపై కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు ఫిట్‌నెస్ లేని 125 బస్సులను అధికారులు సీజ్ చేశారు. మరోవైపు తెలంగాణలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. పిల్లల రక్షణే లక్ష్యంగా గత రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్‌లను చేస్తోన్న అధికారులు.. మోతాదుకు మించి పిల్లలను తీసుకెళ్తోన్న, […]

తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ బస్సులపై ఆర్డీఏ కొరడా
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ వాహనాలపై ఆర్డీఏ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలు పాటించని స్కూల్ వాహనాలపై వారు దాడులు నిర్వహించారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఉదయం నుంచి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటివరకు 152 బస్సులపై కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు ఫిట్‌నెస్ లేని 125 బస్సులను అధికారులు సీజ్ చేశారు.

మరోవైపు తెలంగాణలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. పిల్లల రక్షణే లక్ష్యంగా గత రెండు రోజులుగా స్పెషల్ డ్రైవ్‌లను చేస్తోన్న అధికారులు.. మోతాదుకు మించి పిల్లలను తీసుకెళ్తోన్న, సరిగా పత్రాలు లేని 521 వాహనాలపై కేసు నమోదు చేశారు. అలాగే మద్యం సేవించి వాహనం నడుపుతున్నారన్న అనుమానంతో స్కూల్ పిల్లలను తీసుకెళ్తోన్న డ్రైవర్లకు టెస్ట్‌లు చేస్తున్నారు.